Share News

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్న ప్రజలు

ABN , Publish Date - Mar 23 , 2026 | 12:27 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అందిస్తున్న ప్రజాపాలనను ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు ఆదరిస్తున్నారని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన అజ్మతుల్లా హుస్సేనీ అన్నారు. సిరిసిల్ల కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో అదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్న ప్రజలు
కాంగ్రెస్‌ పార్టీలో చేరిన గంభీరావుపేట మేజర్‌ గ్రామసర్పంచ, వార్డుసభ్యులతో రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన అజ్మతుల్లా హూస్సేనీ

- రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన అజ్మతుల్లా హుస్సేనీ

సిరిసిల్ల అర్బన, మార్చి 22 (ఆంఽధ్రజ్యోతి) : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అందిస్తున్న ప్రజాపాలనను ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు ఆదరిస్తున్నారని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన అజ్మతుల్లా హుస్సేనీ అన్నారు. సిరిసిల్ల కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో అదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడారు. రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పాలించిన బీఆర్‌ఎస్‌ పార్టీ అభివృద్ధిని విస్మరించందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంతరెడ్డి ప్రజాపాలనను ముందుకు తీసుకుని పోతున్నారని అన్నారు. అభివృద్ధితోపాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. 99 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి ప్రజలు ఆదరించడంతోపాటు ప్రజాప్రతినిధులందరు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన నియోజకవర్గంలోని గంభీరావుపేట మండలాన్ని అభివృద్ధి చేయకుండా చీకట్లోకి తీసుకుపోయారని విమర్శించారు. గంభీరావుపేట మండల కేంద్రంతోపాటు గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కటుకం మృత్యుంజయం, జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన నాగుల సత్యనారాయణగౌడ్‌, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవరాజు తదితరులు పాల్గొన్నారు.

- కాంగ్రెస్‌లో చేరిన గంభీరావుపేట సర్పంచ

గంభీరావుపేట మేజర్‌ గ్రామసర్పంచతోపాటు పలువురు వార్డు సభ్యులు అదివారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన అజ్మతుల్లా హుస్సేనీ , మాజీ ఎమ్మెల్యే కటుకం మృత్యంజయం, జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, జిల్లా గంథ్రాలయ సంస్థ చైర్మన నాగుల సత్యనారాయణగౌడ్‌ సమక్షంలో గంభీరావుపేట మేజర్‌ గ్రామసర్పంచ మల్లుగారి పద్మనర్సగౌడ్‌లతోపాటు వార్డు సభ్యులు శుశాంతిక, నరేష్‌, మరికొందరు చేరగా వీరికి పార్టీ కండువాలు కప్పి చేర్చుకున్నారు.

Updated Date - Mar 23 , 2026 | 12:27 AM