Share News

సర్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Jun 26 , 2026 | 12:08 AM

ప్రత్యేక ఓటర్‌ జాబితా సవరణ కార్యక్రమం సర్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

సర్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
ముంజంపల్లిలో గ్రామస్తులకు సర్‌పై అవగాహన కల్పిస్తున్న అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి

మానకొండూర్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక ఓటర్‌ జాబితా సవరణ కార్యక్రమం సర్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండలంలోని ముంజంపల్లి గ్రామంలో కొనసాగుతున్న సర్‌ ప్రక్రియను గురువారం పరిశీలించారు. గ్రామంలోని పలువురి ఇంటికి వెళ్లి సర్‌పైఅవగాహన కల్పించారు. అనంతరం ఎన్యూమరేషన్‌ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సర్‌ కార్యక్రమం 2002 సంవత్సరంలో జరుగగా ప్రస్తుతం మళ్లీ సవరణ జరుగుతుందన్నారు. ఓటర్‌ జాబితా సవరన ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నందగిరి కనకలక్ష్మి, తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, నాయబ్‌ తహసీల్దార్‌ (ఎన్నికలు)భావన, జీపీవో సాగర్‌, కార్యదర్శి పద్మలత, బీఎల్‌వో జ్యోతి, స్వరూప పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2026 | 12:08 AM