పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించాలి
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:04 AM
సిరిసిల్ల పట్టణ అభివృద్ధికి ప్రజలు సైతం సహకరించాలని మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి అన్నారు.
సిరిసిల్ల టౌన్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల పట్టణ అభివృద్ధికి ప్రజలు సైతం సహకరించాలని మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి అన్నారు. గురువారం మున్సిపల్ పరిధిలోని 2, 3, 4, 5, 13, 14, 15, 16, 27, 28 వార్డులో ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మున్సి పల్ ఆధ్వర్యంలో వార్డు సభలను ప్రారం భించారు. ముందుగా ఇటీవల 27వ వార్డు కౌన్సిలర్ కాసర్ల పద్మ గుండె పోటుతో మరణించిగా రెండు నిమిషాలు మౌనం పాటించి ప్రజాప్రతినిధులు, అధికారులు, వార్డు ప్రజలు సంతాపం తెలిపారు. ముఖ్యఅతిథిగా హాజరైన మున్సిపల్ చైర్‌పర్సన్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మున్సి పల్ ఆధ్వర్యంలో వార్డు సభలను ప్రారంభించామని పేర్కొ న్నారు. గురువారం నుంచి ఈనెల 10 వరకు వార్డుల వారీగా వార్డు సభలను నిర్వహిస్తామన్నారు. ఇంటితో పాటు ఇంటి పరిసరాలను సైతం ప్రజలు పరిశుభ్రంగా ఉంచు కోవాలని సూచించారు. తడి,పొడి చెత్తను వేరు చేసి ఇంటి ముందుకు వచ్చే మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు అందించాలని సూచించారు. వార్డులో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావలని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. అన్ని రంగాల్లో సిరిసిల్ల పట్టణాన్ని మరింత అభివృద్ధి పరచడానికి మున్సిపల్ పాలకవర్గం ముందుంటుందన్నారు. అనంతరం వార్డు ప్రజల ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎండీ ఖాదీర్ పాషా, డీఈ, ఏఈలు, శానిటరీ ఇన్‌స్పెక్టర్, సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
వార్డుల్లోని సమస్యల పరిష్కారానికి కృషి
- వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు
వేములవాడ : వేములవాడ మున్సిపల్ వార్డుల్లోని సమస్యలను ప్రజాపాలన ప్రగతి సభలకు తీసుకువస్తే సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు అన్నారు. వేములవాడ పట్టణంలోని 14, 15, 25 వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ లోకేష్, స్థానిక కౌన్సిలర్లతో కలిసి గురువారం పట్టణ ప్రగతి సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంపై మున్సిపల్ ముందస్తు ప్రణాళికలు చేపడుతున్నామని అన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భూగర్భజలాల పెంపునకు ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించుకోవాలని, తడి, పొడి చెత్తను వేరు చేసి స్వచ్చ ఆటోలకే ఇవ్వాలని సూచించారు. వార్డుల అభివృద్దిపై స్థానికులకు పూర్తి భరోసా కల్పిస్తామని, వార్డు ప్రజలకు ఎలాంటి మౌలిక వసతుల సమస్యలు ఉన్నా, తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాల వంటి ఇబ్బందులు ఎదురైతే వార్డు అధికారులు, స్థానిక కౌన్సిలర్లు, లేద తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ప్రజా సమస్యల పరి ష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, అధికారలు జవాబు దారీతనంతో పని చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్ర మంలో మున్సిపల్ మేనేజర్ సంపత్‌రెడ్డి, ఎస్సై రామ్మెహన్, కౌన్సిలర్లు, తూమ్ మధు, కొక్కుల బాలకృష్ణయ్య మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.