Share News

సమాజ అభివృద్దిలో మహిళల పాత్ర కీలకం

ABN , Publish Date - Mar 08 , 2026 | 12:03 AM

సమాజ అభివృద్దిలో మహిళల పాత్ర కీలకమని అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజీ వాఖడే అన్నారు. శనివారం స్థానిక టీఎన్‌జీవో భవన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు.

సమాజ అభివృద్దిలో మహిళల పాత్ర కీలకం
మహిళా ఉద్యోగులతో కలిసి అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజీ వాఖడే

సుభాష్‌నగర్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): సమాజ అభివృద్దిలో మహిళల పాత్ర కీలకమని అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజీ వాఖడే అన్నారు. శనివారం స్థానిక టీఎన్‌జీవో భవన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజీ వాఖడే మాట్లాడుతూ తన తల్లి ఇచ్చిన ప్రేరణతో తాను ఈ స్థాయికి చేరానని తెలిపారు. తన మొదటి గురువు తన తల్లి అని అన్నారు. తల్లి సూచనలు పాటించిన వారు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారన్నారు. అనంతరం మహిళా ఉద్యోగులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎంప్లాయీస్‌ జేఏసీ చైర్మెన్‌, టీఎన్‌జీవోస్‌ అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ మన సంస్కృతిలో స్త్రీలకు ఎంతో ఉన్నతమైన స్థానాన్ని కల్పించారన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి సరస్వతి, టీఎన్‌జీవోస్‌ నాయకులు సంగెం లక్ష్మణ్‌రావు, శారద, సబిత, సునీత, సరిత, విజయలక్ష్మి, హరిప్రియ, సుస్మిత, శైలజ, ముప్పిడి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఒంటెల రవీందర్‌రెడ్డి, రాగి శ్రీనివాస్‌, సర్దార్‌ హర్విందర్‌సింగ్‌, పోలు కిషన్‌, కోట రామస్వామి, శంకరయ్య, గంగారపు రమేశ్‌, రాజేశ్వరరావు, సూర్యశ్రీ, లత, రాధిక, విజయలక్ష్మి, వీణ, స్వర్ణలత, జ్యోతిశ్రీ, ధనలక్ష్మి, కమలాకర్‌, కరుణాకర్‌, అస్గర్‌, రాజేశ్‌భరద్వాజ్‌, రాజేశ్‌, సాయి పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2026 | 12:03 AM