ప్రజలు ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలి
ABN , Publish Date - Mar 07 , 2026 | 11:58 PM
ప్రజలు తమ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ అన్నారు.
సుభాష్‌నగర్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ప్రజలు తమ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం నగరంలోని హౌసింగ్‌బోర్డు కాలనీ, కట్ట రాంపూర్, విద్యానగర్ అర్బన్ హెల్త్ సెంటర్లలో నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శిబిరాల్లో మహిళలకు, ఇతరులకు దీర్ఘకాలిక వ్యాధుల పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారని తెలిపారు. గర్భిణులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుతున్న వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంహెచ్‌ఎన్ పీవో డాక్టర్ సనా జవేరియా, డీపీఎం స్వామి, అర్బన్ హెల్త్ సెంటర్ల మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ ప్రణవ్, డాక్టర్ నవ్య, డాక్టర్ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.