అర్హులందరికీ చేయూత పింఛన్లు అందించాలి
ABN , Publish Date - Nov 16 , 2026 | 11:53 PM
అర్హులైన ప్రతీ ఒక్కరికి చేయూత పింఛన్లు అందించాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.
కరీంనగర్ టౌన్/కరీంనగర్ రూరల్, నవంబరు 16 (ఆంద్రజ్యోతి): అర్హులైన ప్రతీ ఒక్కరికి చేయూత పింఛన్లు అందించాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. కరీంనగర్ మండల పరిషత్ కార్యాలయంలో కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాల లబ్ధిదారులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే గంగల కమలాకర్ సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కొత్తపల్లి మండలంలో 354 కొత్త పించన్లు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, కరీంనగర్ ప్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, ఎంపీడీవో అశోక్‌కుమార్ పాల్గొన్నారు.
ఫ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చేలా చర్యలు తీసుకోవాలి
భగత్‌నగర్/కరీంనగర్ రూరల్: రైతులు పండించిన పంట నేరుగా కొనుగోలు కేంద్రాలకు వచ్చే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూర్, జూబ్లీనగర్, కొత్తపల్లి మండలంలోని ఖాజీపూర్, బావుపేట, కొత్తపల్లిలో కొనుగోలు కేంద్రాలను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు పండించిన పంటకు బహిరంగ మార్కెట్ ధర వచ్చేలా చూడాలన్నారు.