పెన్షనర్ల బకాయిలు విడుదల చేయాలి
ABN , Publish Date - Jan 01 , 2026 | 12:47 AM
పెన్షనర్ల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని తెలంగాణ పెన్షనర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు.
-తెలంగాణ పెన్షనర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అశోక్‌కుమార్
జగిత్యాల అగ్రికల్చర్, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): పెన్షనర్ల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని తెలంగాణ పెన్షనర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. టీపీఏసీ ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్ల పక్షోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భం గా అసోసియేషన్ కార్యాలయంలో జిల్లాలో ఉద్యోగ విర మణ పొందిన 24మంది ఉద్యోగులను హరి అశోక్ కుమార్ చేతుల మీదుగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2024 ఏప్రిల్ 1నుంచి రిటైర్‌మెంట్ అయిన వారికి నేటికీ ప్రయోజనాలు అందలేదన్నారు. పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు పోరు బాట పట్టకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులతో పాటు, పెన్షనర్‌ల సంఘ బాధ్యులు, సభ్యులు పాల్గొన్నారు.