పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:21 AM
పెండింగ్‌లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఉప్పునూటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
సుభాష్‌నగర్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): పెండింగ్‌లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఉప్పునూటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామ పంచాయతి ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా కమిటీ ఆద్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రతి నెలా జీతాలు చెల్లించడంలో విఫలమైందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ డిమాండ్ చేశారు. గ్రామాల్లో కార్మికులను అక్రమంగా తొలగిస్తున్న సర్పంచులపై చర్యలు తీసుకోవాలన్నారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులందరిని పర్మినెంట్ చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, గ్రీన్ ఛానల్ ద్వారా ప్రభుత్వం నేరుగా కార్మికుల ఖాతాల్లో జీతం జమ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాచర్ల మల్లేశం, కమిటీ సభ్యులు రవీందర్‌రావు, కాశిపాక శంకర్, గాజర్ల రాజు, రుద్రారపు నాంపల్లి, మధు, నక్క స్వరూప, కొత్తూరి మల్లయ్య, ఆకునూరి సుధాకర్, భిక్షపతి, శ్రీకాంత్, చంద్రయ్య, కుమార్, లత, చంద్రశేఖర్ పాల్గొన్నారు.