Share News

పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలి

ABN , Publish Date - Oct 29 , 2026 | 11:54 PM

పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సి పల్‌ కార్మికులు బైఠాయించి ధర్నా చేపట్టరు.

పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలి

సిరిసిల్ల టౌన్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి) : పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సి పల్‌ కార్మికులు బైఠాయించి ధర్నా చేపట్టరు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ ఎండీ ఖదీర్‌పాషాకు సీఐటీయూ నాయకులు, కార్మికులు వినతిపత్రం అందిం చారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడారు. అపరిష్కృతంగా కార్మికుల సమస్యలను పరిష్కరిండంలో ప్రభుత్వం, పాలకవర్గం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్మికుల సమస్యల ను పరిష్కరించుకుంటే నవంబరు 5 నుంచి కార్మికులు పనులు మానేసి సమ్మె కు వెళుతారన్నారు. మున్సిపల్‌లో పని చేస్తూ చనిపోయిన, పదవీ విరమణ చేసిన కార్మికుల స్థానాల్లో వారి కుటుంబ సభ్యులను పనిలోకి చేర్చుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులకు పనిభారం పెరిగిందని, అదనంగా కార్మికులను నియమించాలని అన్నారు. కార్మికుల హాజరు గతంలో తీసుకున్న మాదిరిగా మున్సిపల్‌ కార్యాలయంలోనే తీసుకోవాలని అన్నారు. 118 మున్సిపల్‌ కార్మికులకు సంబంధించి 2009 నుంచి 2012 వరకు పెండింగ్‌లో ఈపీఎఫ్‌ సమస్యను వెంటనే పరిష్కరించి కార్మికుల వ్యక్తిగత ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నారు. అదేవిధంగా 2వ బ్యాచ్‌లకు సంబంధించిన 58 మంది కార్మికులు, విలీన గ్రామాల కార్మికులకు రావాల్సిన ఈపీఎఫ్‌ డబ్బులను వెంటనే కార్మికులు అందించాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికులకు ఇవ్వాల్సిన దుస్తులు, చెప్పులు, సబ్బులు, నూనె, గ్లౌజులు ఇతరత్రా రక్షణ, మౌళిక పరిక రాలు, వస్తువులు వెంటనే కార్మికులు ఇవ్వాలన్నారు. కార్మికులందరికి ఈఎస్‌ఐ కార్డులు అందించి స్థానిక వైద్య సదుపాయం కల్పించాలన్నారు. కార్మికులందరికి మున్సిపల్‌ ద్వారా గుర్తింపు కార్డులు అందించాలని, బీమా సౌకర్యాలు కల్పించాల న్నారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించకుంటే నవంబరు 5 నుంచి సమ్మెకు కార్మికులు సిద్ధం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపా ధ్యక్షుడు మూషం రమేష్‌, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కాసర్ల శంకర్‌, నాయకులు దేవరాజు, బాబాకిషన్‌, విజయ, ఉమ, లక్ష్మి, భారతి, ఏసవ్వ, శ్రీనివాస్‌, మల్లేశం, కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - Oct 29 , 2026 | 11:54 PM