Share News

Peddaplli : అర్చకులకు తీపికబురు

ABN , Publish Date - Jun 29 , 2026 | 01:14 AM

సుల్తానాబాద్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): ఆలయాల్లో పని చేస్తున్న అర్చకులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందిస్తుంది.

Peddaplli :  అర్చకులకు తీపికబురు

పలు తాయిలాలను ప్రకటించిన ప్రభుత్వం

కొత్త గృహల నిర్మాణానికి, కొనుగోలుకు రుణాలు

పిల్లల ఉన్నత విద్యకు విద్యా రుణాలు

సుల్తానాబాద్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): ఆలయాల్లో పని చేస్తున్న అర్చకులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందిస్తుంది. వారికి అనేక రాయితీలు సబ్సిడీలు ప్రక టిస్తూ పలు రుణాలను అందివ్వనుంది. గతంలో ఉన్న రుణ పరిమితులను పెంచుతూ కూడా నిర్ణయం తీసు కుంది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ హన్మంతరావు ఈ నెల 12 ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అర్చకులకు పలు ప్రయోజనాలు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు, అర్చకుల సంక్షేమానికి సంబంధించిన సంక్షేమ ట్రస్ట్‌ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అర్చకుల సంక్షేమానికి ఏర్పాటు చేసిన ట్రస్ట్‌ ద్వారా అనేక ప్రయోజనాలను అందించేందుకు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం అందిస్తున్న రుణాలు, సబ్సిడీలు ప్రయోజనాలను పెంచారు.

ఫ పెరిగిన రుణ సహాయాలు

ఆలయాల్లో పని చేస్తున్న అర్చకులకు శాశ్వత ఉద్యో గులకు ప్రస్తుతం సంక్షేమ ట్రస్టు ద్వారా అందిస్తున్న పదవీ విరమణ, గ్రాట్యూటీతోపాటు వారి పిల్లలకు ఉప నయనం, వివాహా, గృహ రుణాలను, అర్చకులు, ఉద్యో గుల పిల్లల ఉన్నత విద్యా రుణాల తదితర వాటికి ఇచ్చే రుణాలు సహాయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఫ సీనియారిటీ ఆధారంగా మంజూరు

ఆలయాల్లో పని చేస్తున్న అర్చకులు ఉద్యోగులకు వారి సీనియారిటీ ఆధారంగా రుణాలను పొందే అవకా శం కల్పించారు. ఇరవై ఏళ్ళు ఉద్యోగం పూర్తి చేసిన వారికి ఎనిమిది లక్షలు, 15 నుంచి 20 ఏళ్ళ లోపు వారికి ఆరు లక్షలు, 10 ఏళ్ళపైన 15 ఏళ్ళ లోపు సర్వీసు కలిగి ఉన్న వారికి 4 లక్షలు, 10 ఏళ్ల సర్వీసు పూర్తి కాకుండా మరణించిన వారికి 4 లక్షలు, 10 ఏళ్ళ సర్వీసు పూర్తి కాకుండా మరణించిన వారికి రెండు లక్షలు గ్రాట్యుటీ ఇస్తున్నారు. అయితే ఈ మొత్తాన్ని ట్రస్టు బోర్డు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి 30 ఏళ్ల సేవలు పూర్తిచేసి రిటైరైన అర్చకులకు ఉద్యోగులకు 12 లక్షలు, 25 ఏళ్లు, ఆపైన సర్వీసు పూర్తి చేసిన వారికి 10 లక్షలు, 20 ఏళ్లు ఆపై పూర్తి చేసిన వారికి 8 లక్షలు, 15 ఏళ్లు ఆ పైన వారికి ఆరు లక్షలు, 10 ఏళ్లు ఆపైన వారికి నాలుగు లక్షలు, పదేళ్ళు కూడా సర్వీసు పూర్తి కాకుండా మృతి చెందిన వారికి మూడు లక్షల గ్రాట్యూటీని ట్రస్టు చెల్లించనుంది. ఉపనయనా లకు ప్రస్తుతం ట్రస్టు ద్వారా 50 వేలు ఇస్తుండగా ఆ మొత్తాన్ని లక్షకు పెంచారు.

ఫ విద్యా రుణాలు

అర్చకుల సంక్షేమ ట్రస్టు ద్వారా ప్రస్తుతం అర్చకుల పిల్లలకు ఉన్నత విద్య, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యలకు విద్యా గ్రాంట్‌ ద్వారా రూ.35 వేలు చెల్లిస్తున్నారు. ఈ మొత్తాన్ని రూ.50 వేలకు పెంచారు. అలాగే విద్యా రుణాన్ని 5 లక్షల నుంచి 8 లక్షలకు పెంచారు. ఈ రుణాలకు సంబంధించిన వడ్డీలను కూడా ట్రస్టు చెల్లించనుంది. ధూపదీప నైవేద్యం పథకం కింద అర్చకులు కాకుండా దేవాదాయశాఖ పరిధిలో పని చేస్తున్న రెగ్యులర్‌ అర్చకులు ఉద్యోగులకు మాత్రమే పెంచిన మొత్తాలు వర్తిస్తాయి. పర్మనెంట్‌ అర్చకులకు కాకుండా డీడీఎన్‌ కింద పని చేస్తున్న అర్చ కులకు మాత్రం ఉపనయనాలు, విద్యారుణాలు మాత్రమే వర్తిస్తాయని కమిషనర్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఫ ఇంటి రుణాలకు పదేళ్ల వడ్టీ ట్రస్టు చెల్లింపు

దేవాదాయ శాఖ శాశ్శత అర్చకులు ఉద్యోగులు ఇంటి నిర్మాణానికి ఏదైనా బ్యాంకుల నుంచి పది లక్షలు రుణాలు తీసుకుంటే ఆ మొత్తానికి సంబంధించిన వడ్డీ మాత్రం పదేళ్ల వరకూ సంక్షేమ ట్రస్టు చెల్లిస్తుంది. తాజాగా ఈ రుణం మొత్తాన్ని రూ.15 లక్షలకు పెం చారు. ఇంటి మరమ్మతులకు కూడా బ్యాంకుల ద్వారా రుణాలు పొందేలా వెసలుబాటు కల్పించారు. నాలుగు లక్షల రుణం తీసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇందుకు సంబందించిన వడ్డీ కూడా ట్రస్ట్‌ చెల్లించ నుంది. ఆయితే ఈసారి ఆ మొత్తాని ఐదు లక్షలకు పెంచారు.

Updated Date - Jun 29 , 2026 | 01:14 AM