Share News

Peddapalli: 2027-28నాటికి యంగ్‌ ఇండియా సమీకృత గురుకులాలలు ప్రారంభించాలి

ABN , Publish Date - Jan 13 , 2026 | 12:42 AM

పెద్దపల్లి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): విద్యా సంవత్సరం(2027-28) నాటికి యంగ్‌ ఇండియా సమీకృత గురుకులాలు ప్రారంభించాలని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తెలిపారు.

 Peddapalli:   2027-28నాటికి యంగ్‌ ఇండియా సమీకృత గురుకులాలలు ప్రారంభించాలి

- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

పెద్దపల్లి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): విద్యా సంవత్సరం(2027-28) నాటికి యంగ్‌ ఇండియా సమీకృత గురుకులాలు ప్రారంభించాలని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తెలిపారు. సోమవారం ఆయ న హైదరాబాద్‌నుంచి యంగ్‌ ఇండియా ఇంటిగ్రే టెడ్‌ స్కూళ్ల నిర్మాణాలపై మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌, పార్లమెంట్‌ సభ్యులు బలరాంనాయక్‌, ప్రభుత్వప్రధానకార్యదర్శి రామ కృష్ణారావు, టిజిఈడబ్ల్యూ ఐడీసీ ఎండీ గణపతితో కలిసి అన్నిజిల్లాల కలెక్టర్లు, అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామీణప్రాంత విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించి పోటీప్రపంచంలో నిలబడేలా తీర్చిదిద్దే ఉద్దేశంతో నిర్మిస్తున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కలెక్టర్లు ప్రతివారం పాఠశాలల నిర్మాణ పురోగతిపై సమీక్ష నిర్వహించాలన్నారు. ఈ అంశంపై కలెక్టర్లు అలసత్వం ప్రదర్శించకూ డదని, పూర్తిస్థాయి నాణ్యతా ప్రమాణాలతో పాఠశాలలు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్‌ జే అరుణశ్రీ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2026 | 12:42 AM