Share News

Peddapalli: నాణ్యతలో రాజీపడకుండా వేగంగా పనులు పూర్తిచేయాలి

ABN , Publish Date - Jun 28 , 2026 | 12:20 AM

పెద్దపల్లి, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): నాణ్య తలో ఎలాంటి రాజీపడకుండా ప్రభుత్వ ఆసు పత్రి భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని

 Peddapalli:  నాణ్యతలో రాజీపడకుండా వేగంగా పనులు పూర్తిచేయాలి

- ప్రభుత్వ విప్‌ విజయరమణరావు ఆదేశాలు

పెద్దపల్లి, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): నాణ్య తలో ఎలాంటి రాజీపడకుండా ప్రభుత్వ ఆసు పత్రి భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులను ప్రభుత్వవిప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమ ణారావు ఆదేశించారు. శనివారం ఆయన పెద్దపల్లి జిల్లాకేంద్రంలో రూ.52కోట్ల వ్యయం తో నిర్మిస్తున్న వందపడకల ప్రభుత్వ ఆసు పత్రి భవన నిర్మాణపనులను పరిశీలించారు. నిర్మాణ పనులు ఎంతమేర పూర్తయ్యాయి, ఎప్పటిలోగా పూర్తవుతాయి, ప్రజలకు ఎప్పు డు అందుబాటులోకి వస్తాయనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లా డుతూ పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజ లకు అత్యాధునిక వైద్యసేవలు అందించేం దుకు 100పడకల నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని తెలి పారు. కాంగ్రెస్‌ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్య మంత్రి ఆధ్వర్యంలో ఆసుపత్రిని 100పడక లకు అప్‌గ్రేడ్‌ చేసి రూ.52కోట్లతో నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. మరో ఏడాదిలో నూతన ఆసుపత్రి భవనం పూర్తై ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఏడాదిన్నరగా ప్రభుత్వ ఆసుపత్రిలో క్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయ వంతంగా నిర్వహిస్తూ పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తు న్నారని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ప్రజ లంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో మున్సిపల్‌చైర్మన్‌ నూగిళ్ల మల్లయ్య, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీధర్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 28 , 2026 | 12:20 AM