Peddapalli: గడువులోగా పనులు పూర్తి చేయాలి..
ABN , Publish Date - Apr 15 , 2026 | 11:25 PM
పెద్దపల్లి, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను గడువులోగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.
- కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను గడువులోగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలోని విద్యాసంస్థల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, నూతన తరగతి గదుల నిర్మాణం, మౌలిక వసతుల ఏర్పాటును వేగవంతం చేసి వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయాల పనులను జూన్ నాటికి పూర్తిచేసి ప్రజలకు అందు బాటులోకి తీసుకురావాలని, ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు. పనుల వేగవంతం కోసం అవసరమైతే అదనపు షిఫ్టులు ఏర్పాటు చేయా లన్నారు. రాత్రి వేళల్లో కూడా లైటింగ్ సదుపా యాల తో పనులు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే జిల్లాలో చేపట్టిన అంగన్‌వాడీ కేంద్రాల మరమ్మతు పనులను మే 15లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో పీఆర్ ఈఈ శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.
వెన్నంపల్లిలో భూములను పరిశీలించిన కలెక్టర్..
కాల్వశ్రీరాంపూర్ : మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో బుధవారం కలె క్టర్ కోయశ్రీహర్ష 416నం బర్‌లోని వ్యవసాయ భూములను పరిశీలిం చారు. 2013లో ఎమ్మెల్యే చింతకుంట విజయరమ ణారావు వెన్నంపల్లి గ్రామంలోని పలువురు నిరుపేదలకు ప్రభుత్వ భూమి 416సర్వే నెంబర్‌లోని అసైన్‌మెంట్ కమిటీ ద్వారా పట్టాలు ఇచ్చారు. రైతులు ఈభూములు దున్నుకుంటున్నా అప్పటి ధరణి పాస్‌బుక్కులో నమోదు కాలేదు. దీంతో 12ఏళ్లుగా రైతులు తహసీ ల్దార్ కార్యాలయం చుట్టు తిరుగుతున్నారు. ఇటీవల సర్పంచ్ కలవేన రమ రమేష్ ఈవిషయం కలెక్టర్ కోయశ్రీహర్ష దృష్టికి తీసుకుపోయారు. స్పందించిన ఆయన వెన్నంపల్లి గ్రామశివారులోని భూములను పరిశీలించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రాపెల్లి రాముడు, ఆర్‌ఐ వాజిద్ అలీ, జీపీవోలు, సర్పంచ్ రమ రమేశ్, రైతులు పాల్గొన్నారు.