Share News

Peddapalli: నిమజ్జనానికి నీళ్లేవి?

ABN , Publish Date - Sep 22 , 2026 | 01:11 AM

కోల్‌సిటీ, సెప్టెం బరు 21 (ఆంధ్రజ్యో తి): ఎల్‌నినో ఎఫెక్ట్‌ గణపతి నిమజ్జనంపై పడింది. వర్షాకాలంలో నిండుకుండలా ప్రవ హించాల్సిన గోదావ రిలో వర్షాభావ పరిస్థి తులతో నీరు కరు వైంది. ఎల్లంపల్లి దిగు వన నీటిప్రవాహం పూర్తిగా పడిపోయిం ది.

Peddapalli: నిమజ్జనానికి నీళ్లేవి?

వర్షాభావంతో గోదావరిలో ప్రవాహం కరువు

పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల గణపతి నిమజ్జనానికి నీళ్ల కరువు

గోదావరి వంతెనకు తరలిరానున్న 3వేల విగ్రహాలు

ఎల్లంపల్లినుంచి నీటి విడుదలే మార్గం..

కోల్‌సిటీ, సెప్టెం బరు 21 (ఆంధ్రజ్యో తి): ఎల్‌నినో ఎఫెక్ట్‌ గణపతి నిమజ్జనంపై పడింది. వర్షాకాలంలో నిండుకుండలా ప్రవ హించాల్సిన గోదావ రిలో వర్షాభావ పరిస్థి తులతో నీరు కరు వైంది. ఎల్లంపల్లి దిగు వన నీటిప్రవాహం పూర్తిగా పడిపోయిం ది. మడుగులలోనే నీరుండే పరిస్థితి ఉంది. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా లకు చెందిన కోల్‌బెల్ట్‌లోని సుమారు3వేల విగ్రహాలు గోదావరిఖని గోదా వరి వంతెన వద్ద నిమజ్జనం చేయనున్నారు. ఇవికూడా వంతెనపై నుంచి నదిలో వేయడం పరిపాటి. ఈసారి సుందిళ్ల బ్యారేజీలో నీటినినిల్వ చేయకపోవడంతో గోదావరి వంతెనవద్ద నీరులేదు. గోదావరిఖని పుష్కర ఘాట్‌కు 200మీటర్ల వరకు నీటిప్రవాహం లేని పరిస్థితి ఉంది. దీంతో బుధవారం జరుగాల్సిన గణపతి నిమజ్జంపై భక్తుల్లో ఆందోళన వ్యక్తమ వుతున్నది. భక్తులతోపాటు పోలీస్‌లు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ యంత్రాం గం కూడా ఆందోళన పడుతున్నారు. ఈసారి పెద్దపల్లి జిల్లాలోని రామ గుండం పారిశ్రామిక ప్రాంతంతోపాటు సమీపగ్రామాల నుంచి 1500లకు పైగా గణనాథులు గోదావరివంతెన వద్దకురానున్నాయి. అలాగే మంచి ర్యాల జిల్లాలోని నస్పూర్‌, మంచిర్యాల, శ్రీరాంపూర్‌, మందమర్రి, జైపూర్‌ తదితర ప్రాంతాలనుంచి 1270విగ్రహాలు గోదావరి వంతెననుంచి నిమ జ్జనం చేసేలా ప్రణాళికలు వేసుకున్నారు. గోదావరివంతెన వద్ద ఈ మేర కు వంతెన పైనుంచే నదిలోవిగ్రహాలు వేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇం దుకు సంబంధించి ప్లాట్‌ఫామ్‌లు కూడా ఏర్పాటు చేశారు. నదిలో నీళ్లు లేకపోతే విగ్రహాలు ఎక్కడనిమజ్జనం చేయాలనే ఆందోళన వ్యక్తమవుతు న్నది. ఎల్లంపల్లిప్రాజెక్టులో ప్రస్తుతం 19టీఎంసీలవరకు నీటి నిల్వలున్నా యి. 2013లో నిమజ్జనానికి ఎలం్లపల్లి నుంచి నీటిని వదిలారు. ఈ సారి కూడా నీటిని వదలాలని భక్తులు కోరుతున్నారు.

Updated Date - Sep 22 , 2026 | 01:11 AM