Share News

Peddapalli: వడ్లను కొనేదెప్పుడు?

ABN , Publish Date - Apr 27 , 2026 | 12:17 AM

సుల్తానాబాద్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): యాసంగి పంటకు సంబంధించిన ధాన్యం కొనుగోలుకేంద్రాల్లో కుప్ప లుతెప్పలుగా పేరుకుపోతున్నాయి.

Peddapalli:  వడ్లను కొనేదెప్పుడు?

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు

వాతావరణం మార్పులతో రైతన్నల ఆందోళన

కొనుగోళ్లు వేగవంతం చేయాలంటున్న రైతులు

సుల్తానాబాద్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): యాసంగి పంటకు సంబంధించిన ధాన్యం కొనుగోలుకేంద్రాల్లో కుప్ప లుతెప్పలుగా పేరుకుపోతున్నాయి. ఎక్కడా చూసినా ధాన్యం రాశులే కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా ఈయాసంగి సీజన్‌కు సంబంధించి ధాన్యం దిగు బడులు వచ్చాయి. ఇరవైరోజుల నుంచి కొనుగోలు కేంద్రా లకు ధాన్యంవస్తోంది. అయితే ఇప్పటివరకు కొన్ని సెంటర్లలో కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. కొన్ని ప్రాంతాల్లో కేంద్రాలు ప్రారంభించినా కొనుగోళ్లు మాత్రం నేటికీ ప్రారంభించలేదు. వర్షం వస్తే ధాన్యం తడిచి తీవ్రఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి ధాన్యం కొను గోళ్లను వేగవంతం చేయాలని కోరుతున్నారు.

- మండలంలో ఐదు సహకార సంఘాలు..

సుల్తానాబాద్‌ మండలంలో ఐదు సహకార సంఘాలు ఉన్నాయి. ప్రతీ వ్యవసాయ సీజన్‌లో ఈ సంఘాల ద్వారా మాత్రమే ఎక్కువగా ధాన్యం కొనుగోలు చేస్తారు. కానీ ఈ సారి ఇంకా పూర్తి స్థాయిలో కేంద్రాలను ప్రారంభించలేదు. సుల్తానాబాద్‌ సహకార సంఘం పరిధిలో పది గ్రామాలుం డగా ఇప్పటివరకు నీరుకుళ్ల, కోమండ్లపల్లి గట్టేపల్లి, కాట్న పల్లి, కందునూరిపల్లి, పూసాలలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉంది. చిన్నకలువల సహకార సంఘం పరిధిలో నారాయనపూర్‌, కొదురుపాక, చిన్నబొంకూరు, మియాపూర్‌, పెరుకపల్లి, దేవునిపల్లి వాగోడ్డుపల్లి చిన్నకలు వల, రెబ్బలేద్దవ్‌పల్లి 9సెంటర్లు ఉండగా ఇప్పటివరకు ఒక్క గ్రామంలో కూడా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించలేదు. గర్రెపల్లి సొసైటీలో తొమ్మిదిసెంటర్లు ఉండగా భూపతిపూర్‌, నర్సయ్యపల్లి, బొంతకుంటపల్లి, గర్రెపల్లి, దుబ్బపల్లి,ఐత రాజుపల్లి, సాంబయ్యపల్లి, నారాయణారావుపల్లి గొల్లపల్లి ఉండగా ఇప్పటివరకూ ఒక్క సెంటర్‌ కూడా ప్రారంభం కాలేదు. చాలారోజుల నుంచి రైతులు తమ దాన్యాన్ని ఆరబె ట్టుకుని ఉన్నారు. తేమశాతం వచ్చినా కొనుగోళ్ల మాట దేవుడెరుగు కేంద్రాలు కూడా ప్రారంభం కాలేదు. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనుకుల సొసైటీ పరిధలో మూడు, నాలుగు కేంద్రాలు ఉండగా ఇక్కడ పదిహేను రోజుల నుంచి రైతులు తమ ధాన్యాన్ని ఎప్పుడు కాంటా వేస్తారా అని ఎదురు చూస్తున్నారు. కాగా కొన్ని కొనుగోలు కేంద్రాలను శనివారం ప్రారంభించారు.

Updated Date - Apr 27 , 2026 | 12:17 AM