Peddapalli: అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
ABN , Publish Date - Mar 11 , 2026 | 12:37 AM
పాలకుర్తి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సంక్షేమఫలాలు అర్హులందరికీ అందుతాయని రామ గుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ అన్నారు.
- రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్ సింగ్
పాలకుర్తి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సంక్షేమఫలాలు అర్హులందరికీ అందుతాయని రామ గుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యా లయం ఆవరణలో ఎంపీడీవో పొల్సాని శశికళ అధ్యక్ష తన నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతిప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. అభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత సమ ర్ధవంతంగా చేరవేయడమే ఈ 99 రోజుల ప్రణాళిక ప్రధానఉద్దేశం అని పేర్కొన్నారు. అంతకుముందు డీఎం ఎఫ్‌టి ఈజీఎస్ నిధులు 40లక్షలతో గ్రామంలో సీసీ రోడ్డు,కల్వర్టు నిర్మాణం పనులను ప్రారంభించారు. కార్య క్రమంలో సర్పంచ్ పెద్దపల్లి తిరుమల, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముక్కెర శ్రీనివాస్‌గౌడ్, తహసీల్దార్ జేరుపోతుల సునీత, మండల విద్యాధికారి తానం విమల,ఎంపీవో ఉప్పు సుధర్శన్, రామగుండం మార్కెట్ కమిటి చైర్మెన్ గడ్డం తిరుపతి,మాజీ ఎంపీపీ గంగాధరి రమేష్‌గౌడ్,నాయకులు మల్క రామస్వామి, గ్రామశాఖ అధ్యక్షుడు మేర్గు అశోక్,తదితరులు పాల్గొన్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి..
యైుటింక్లయిన్‌కాలనీ: ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి అని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతిప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం కాలనీ లోని15,18,19 డివిజన్‌లలో ఎమ్మె ల్యే మేయర్ మహంకాళిస్వామితో కలిసి పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్య, మౌళికవసతులు, డ్రైనేజీ, రోడ్లువంటి వాటిపై స్థానికుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ఆయా డివిజన్‌లలో ప్రజలతో మాట్లా డారు. స్థానికంగా సమస్యలు వస్తే ప్రజాప్రతినిధుల కోసం ఎదురుచూడ కుండా అధికారులతో మాట్లాడి పరిష్కరించుకుంటేనే నిజమైన అభివృద్ధి జరిగినట్టు అని అన్నారు. అనంతరం 15వ డివిజన్ కుమారస్వామినగర్‌లో నూతనంగా నిర్మించిన వాటర్‌ట్యాంకును ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమం లో కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ, డిప్యూటీ మేయర్ ఎల్లయ్య, కార్పొరేటర్లు సుశీలరాజిరెడ్డి, అనుము రాములు స్వరూప, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుండేటి రాజేష్, నాయకులు బత్తిని శ్రీనివాస్, సాగంటి శంకర్, మార్కరాజు పాల్గొన్నారు.
గోదావరిఖనిలో ప్రధాన నాలా అభివృద్ధి..
కోల్‌సిటీ : గోదావరిఖని పట్టణంలోని ఎన్‌టీఆర్ నగర్, కళ్యాణ్‌నగర్, సీతానగర్‌ల నుంచి ప్రవహిస్తున్న ప్రధాన నాలాను అభివృద్ధి చేసి నాలా పక్కన రోడ్డు నిర్మించే యోచన చేస్తున్నట్టు ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆయన పర్యటించారు. నాలాలో చెత్త వేయకుండా రాష్ట్రంలోనే మొదటిసారిగా జాలీలు ఏర్పాటు చేశామ న్నారు. రామ గుండంలో మరిన్ని నిధులు తీసుకువచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. సొంతస్థలాలు ఉన్న అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్ర మంలో మేయర్ మహంకాళి స్వామి, అదనపు కలెక్టర్ అరుణశ్రీ, డిప్యూటీమేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొ రేటర్ నెలకంటి రాము పాల్గొన్నారు.