Peddapalli: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం
ABN , Publish Date - Jun 01 , 2026 | 01:09 AM
మంథని, మే 31 (ఆంధ్రజ్యోతి): కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీ సంస్థలో అధికారిక యూనియన్ ఎన్నికలు నిర్వహించిన తర్వాత సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని
గోదావరి పుష్కరాలకు భారీ రవాణా సదుపాయాలు
310కోట్ల పైగా జీరో టికెట్లు జారీచేశాం
మంత్రులు పొన్న ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
మంథని, మే 31 (ఆంధ్రజ్యోతి): కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీ సంస్థలో అధికారిక యూనియన్ ఎన్నికలు నిర్వహించిన తర్వాత సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి మంథని బస్టాండ్‌లో రూ.93లక్షలతో ఆధునీకరణ పనులకు ఆదివారం మంత్రి పొన్నంప్రభాకర్ శంఖు స్థాపన చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. సంస్థ విలీనం అంశంపై మంత్రుల సబ్‌కమిటీ ఇప్పటికే చర్చించి నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు 310కోట్లపైగా జీరోటిక్కెట్లు జారీ చేశామ న్నారు. 2027జరగబోయే గోదావరినది పుష్కరాలకు భారీస్థాయిలో రవాణా సదుపాయాలు కల్పిస్తామన్నా రు. మంథని, కాళేశ్వరం బస్టాండ్లను పూర్తి స్థాయిలో ఆధునీకరించి ప్రజారవాణా సేవలను మరింత మెరుగుపరుస్తామ న్నారు. మంథని బస్టాండ్ ఆవరణ అభివృద్ధికి రూ.93లక్షలు, కాళేశ్వరం బస్టాండ్ అభివృద్ధికి రూ.3కోట్లు మంజూరు చేశామన్నారు. కాళేశ్వరం దేవస్థానం అభివృద్ధిలో రవాణా సంస్థ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ కోయశ్రీహర్ష, మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్‌చైర్మన్ ముస్కుల సహేందర్‌రెడ్డి, ఈఆర్‌సీ మెంబర్ శశిభూషన్ కాచే, డీసీసీ అధికార ప్రతినిధి సెగ్గెం రాజేష్, ఆర్డీవో సురేష్, కరీంనగర్ ఆర్‌ఎం రాజు, డిప్యూటీ ఆర్‌ఎం మల్లేశం, డీఎం శ్రావణ్ కుమార్, ఎఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న, మండల పార్టీ అధ్యక్షుడు ఐలి ప్రసాద్, మంథని సురేష్, సత్యం పాల్గొన్నారు.
మంత్రులకు ఘన సన్మానం
కమాన్‌పూర్ : రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌ను ఆదివారం కమాన్‌పూర్ మండలంలోని రొంపికుంట, పేరపల్లి గ్రామాలకుచెందిన పలువురు కాంగ్రెస్‌నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రొంపికుంట సర్పంచ్ గుమ్మడి శ్రీనివాస్, మాజీసర్పంచ్ కటకం రవీందర్, పేరపల్లి మాజీ సర్పంచ్ తొగరి అన్నపూర్ణ అశోక్, మాజీ ఎంపీటీసీ కటకం నారాయణ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి శ్రీధర్‌బాబుకు వినతుల వెల్లువ
రామగిరి : మంథనిలో బస్టాండ్ పనుల శంకుస్థాపనకు వెళ్తున్న సందర్భంగా కల్వచర్ల, రాజాపూర్ సర్పంచ్‌లు రేండ్లశారద, పుల్లెల భాగ్యలక్ష్మి, ఐఎఫ్‌టీయూ నాయకుడు ఆకుల వెంకన్న ఐటీమంత్రి శ్రీధర్‌బాబు, రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రాలను అందజేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు సర్పంచ్‌లు తెలిపారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమంలో నాయకులు కాల్వశ్రీనివాస్, అరెల్లికొంరయ్యగౌడ్, మాటేటి రవి, పుట్టసంతోష్, ఓదెలు, శ్రీనివాస్, రాజయ్య, సదానందం, అనిల్ తదిత రులు పాల్గొన్నారు.