Peddapalli: చివరిగింజ కొనే వరకు రైతుల పక్షాన పోరాడుతాం
ABN , Publish Date - May 31 , 2026 | 12:48 AM
పెద్దపల్లి టౌన్, మే 30 (ఆంధ్రజ్యోతి) చివరిగింజ కొనేవరకు రైతుల పక్షాన ప్రభు త్వంపై పోరాడుతామని బీజేపీజిల్లా అధ్య క్షుడు కర్రె సంజీవ్‌రెడ్డి తెలిపారు.
-బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి
పెద్దపల్లి టౌన్, మే 30 (ఆంధ్రజ్యోతి) చివరిగింజ కొనేవరకు రైతుల పక్షాన ప్రభు త్వంపై పోరాడుతామని బీజేపీజిల్లా అధ్య క్షుడు కర్రె సంజీవ్‌రెడ్డి తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా లో సాగువిస్తీర్ణం పంటల రాబడిని అంచనా వేయడంలో అధికారులు పూర్తిగా విఫలం అయ్యారన్నారు. ఇది స్థానికఎమ్మెల్యే విజయర మణారావు చేతగాని తనమేనన్నారు. బీజేపీ చేపట్టిన రైతుభరోసా యాత్రతో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల్లో వణుకు మొదలై లారీలు సమకూర్చి ధాన్యం సేకరణ ప్రారంభించారన్నారు. బార్దాన్లు, సుతిలు తాడు చివరకు దబ్బణంసూది కూడా కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తున్నా ధాన్యంసేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని విమ ర్శించారు. జిల్లాలో 360రైసుమిల్లులు ఉన్నాయని అందులో 70వరకు డీఫాల్టర్లు ఉన్నారని వారివద్ద 700 కోట్లబకాయిలు ఉన్నాయని తెలిపారు.వారిని బ్లాక్‌లిస్టు లో పెట్టాలని ఆదేశాలుఉన్నా తిరిగివారికి ధాన్యం కొను గోలు అనుమతులు ఎలా ఇస్తారని నిలదీశారు. ఇందు లో ఎమ్మెల్యేతోపాటు అధికారులకువాటాలు అందుతు న్నాయని ఆరోపించారు. సమావేశంలో నాయకులు బెజ్జంకిదిలీప్‌కుమార్, శివంగారి సతీష్, కందులశ్రీనివాస్, భూతగడ్డ రాజ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.