Peddapalli: బీఆర్‌ఎస్ నాయకుల పాపాల చిట్ట బయటపెడతాం
ABN , Publish Date - Sep 22 , 2026 | 01:12 AM
ధర్మారం, సెప్టెంబరు 21 (ఆంధ్ర జ్యోతి) రానున్న రెండు సంవత్సరా ల్లో బీఆర్‌ఎస్ నాయకుల పాపాల చిట్ట పూర్తిగా బయట పెడతామని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ, సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు.
ధర్మారం, సెప్టెంబరు 21 (ఆంధ్ర జ్యోతి) రానున్న రెండు సంవత్సరా ల్లో బీఆర్‌ఎస్ నాయకుల పాపాల చిట్ట పూర్తిగా బయట పెడతామని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ, సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని ఎస్సీకాలనీ, రామాలయం, గణేష్ నగర్, బోయవాడ, తెనుగువాడ, పద్మశాలిసంఘం, ఆర్యవైశ్య సంఘం ఆధ్యర్యంలో ఏర్పాటుచేసిన వినా యక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆదివారం కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ నాయకులు చేసిన భూ దోపిడీని సాక్ష్యాలతో సహా ముఖ్యమంత్రి అసెంబ్లీ నిండు సభలో పెట్టారని తెలిపారు. రానున్న రెండు సంవత్సరాల్లో బీఆర్‌ఎస్ నాయకుల పాపాలచిట్టా పూర్తిగా బయట పెడుతామని, అందుకు మీరు రాజకీయాల నుంచి వైదొలుగుతారా అంటూ బీఆర్‌ఎస్ నాయకులను అడ్లూరి ప్రశ్నించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చింతల ప్రదీప్‌రెడ్డి, లావుడ్య రూప్లానాయక్, గాగిరెడ్డి తిరుపతి రెడ్డి, కొత్త నర్సింహులు, కొడారి అంజన్న, పాలకుర్తి రాజేశం, కామినేని శ్రీనివాస్, ద్యాగేటి ఉదయ్, ఎలిగేటి మల్లేశం, సంగ రంజిత్ కుమార్, మెడవేని తిరుపతి, అరిగె లింగయ్య, ఈదుల శ్రీనివాస్, ఒడ్నాల శంకరయ్య, తుమ్మ తిరుపతి, కుంట రాజు, తదితరులు పాల్గొన్నారు.