Peddapalli: గుంట భూమి ఎండిపోకుండాసాగునీరు అందించాం
ABN , Publish Date - Apr 23 , 2026 | 12:34 AM
ఓదెల, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పాలన లోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో ఏ మండ లంలోనైనా గుంటభూమి ఎండిపోకుండా వరి, మక్క జొన్న, పత్తిపంటలకు సాగునీరు అందించామని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు అన్నారు.
- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు
ఓదెల, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పాలన లోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో ఏ మండ లంలోనైనా గుంటభూమి ఎండిపోకుండా వరి, మక్క జొన్న, పత్తిపంటలకు సాగునీరు అందించామని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు అన్నారు. బుధవారం గుండ్లపల్లి, కనగర్తి, మడ క, తదితర గ్రామాల్లో ప్యాక్స్, ఐకేపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన హయాంలో మార్క్‌ఫెడ్‌లోగానీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గాని ఎలాంటి మోసాలు లేకుండా కొను గోలు చేస్తున్నామన్నారు. ఓదెలలో మరోమార్క్‌ఫెడ్ కేంద్రాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తానన్నారు. అనం తరం మడకలో ఇటీవల అనారోగ్యంతో కోటసంజీవ రెడ్డి మృతిచెందగా ఆయన కుమారుడైన కోటగోపాల్ రెడ్డిని పరామర్శించారు. ఇదేగ్రామానికి చెందిన గట్టు ప్రశాంత్ కొలనూర్ రోడ్డుప్రమాదంలో తీవ్రగాయా లకు గురికాగా అతన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్‌సాగర్‌రెడ్డి, సింగిల్‌విండో మాజీచైర్మన్ ఆళ్ల సుమన్‌రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పిట్టల రవికుమార్, అధికార ప్రతినిధి బైరిరవిగౌడ్, సర్పంచులు పుప్యాల స్వప్న,శంకర్, చొప్పరి సంధ్యారాణి, కుమార్, ఆవాల ప్రసాద్, సారమ్మ కొమురయ్య, తదితరులున్నారు.
మక్కల కొనుగోలు కేంద్రం
ఏర్పాటుకు స్థల పరిశీలన..
సుల్తానాబాద్ : సుల్తానాబాద్ ప్రాంత రైతుల సౌకర్యార్థం మక్క ల కొనుగోలు కేంద్రం కోసం స్థల పరిశీలన జరుగుతుందని విప్ విజయరమణారావు అన్నారు. బుధవారం సుల్తానాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో, శాస్త్రినగర్‌లో, మండలంలోని కదంబపూర్, సుద్దాల,రేగడిమద్దికుంట గ్రామాల్లో సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొను గోలుకేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ వ్యవసాయమార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మండ లంలో మక్కలు అధికంగా పండించారని, అయితే వ్యవ సాయ మార్కెట్‌లో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం నిబంధనల ప్రకారం వీలు కాద న్నారు. అయితే మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు కోసం స్థలఅన్వేషణ జరుగుతుందని త్వరలోనే ఏర్పా టు చేస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌చైర్మన్ మిను పాల ప్రకాష్‌రావు, సీఈవో బూరుగు సంతోష్, ఏఓ నీలవేణి, మార్కెట్ కార్యదర్శి మనోహర్,కిసాన్ సెల్ అధ్యక్షుడు పన్నాలరాములు, ఏఎంసీ డైరక్టర్ ఇల్లెందుల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాక్రిష్ణ, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.