Share News

Peddapalli: మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించాలి

ABN , Publish Date - Feb 07 , 2026 | 12:26 AM

జ్యోతినగర్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 11న జరిగే మున్సిపల్‌ ఎన్నికలకు అధికారులు సహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌ అరుణశ్రీ పేర్కొన్నారు.

Peddapalli:  మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించాలి

-అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ

జ్యోతినగర్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 11న జరిగే మున్సిపల్‌ ఎన్నికలకు అధికారులు సహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌ అరుణశ్రీ పేర్కొన్నారు. శుక్రవారం ఎన్టీపీసీ పీటీఎస్‌ కాకతీయ కళ్యాణ మండపంలో ప్రీసైడింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికా రులకు రెండోవిడత శిక్షణ తరగతులు నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్లు, అభ్యర్థులు, ఏజెంట్లు, సిబ్బంది అందరిని సమన్వయం చేసుకుంటూ పోలింగ్‌ సాఫీగా జరిగేలా ప్రిసైడింగ్‌ అధికారులు చూడాలని అన్నా రు. పోలింగ్‌ కేంద్రంలో ప్రిసైడింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులతోపాటు ఇతర సహాయ సిబ్బంది కూడా ఉంటారని అన్నారు. ఓటరు ఒరిజినల్‌ గుర్తింపుకార్డు పరిశీలించిన అనంతరం ఓటు వేయడానికి అనుమతించా లని అన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో వెబ్‌ కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా శిక్షకులు కేడం శ్రీనివాస్‌, శ్రీనివాస్‌ పోలింగ్‌ రోజు ప్రిసైడింగ్‌ అధికా రులు, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు నిర్వర్తించాల్సిన విధుల గురించి వివరిం చారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీకమిషనర్‌ నాయిని వెంక టస్వామి, అసిస్టెంట్‌కమిషనర్‌ వెంకటేశ్వర్లు, రెవెన్యూఆఫీసర్‌ ఆంజనే యులు, సూపరిండెంట్‌ పబ్బాల శ్రీనివాస్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2026 | 12:26 AM