Share News

Peddapalli: నిందితులకు శిక్షలు పడేలా చూడాలి

ABN , Publish Date - May 30 , 2026 | 12:22 AM

కోల్‌సిటీ, మే 29 (ఆంధ్రజ్యోతి): నింది తులకు శిక్షలు పడిలా పోలీసులు, పబ్లిక్‌ ప్రాసిక్యుటర్లు పనిచేయాలని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ఝా సూచించారు.

Peddapalli: నిందితులకు శిక్షలు పడేలా చూడాలి

రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా

కోల్‌సిటీ, మే 29 (ఆంధ్రజ్యోతి): నింది తులకు శిక్షలు పడిలా పోలీసులు, పబ్లిక్‌ ప్రాసిక్యుటర్లు పనిచేయాలని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ఝా సూచించారు. శుక్రవారం రామగుండం పోలీస్‌ కమిషన రేట్‌లో పెద్దపల్లి, మంచిర్యాలజిల్లాలో వివిధ రకాలకేసుల దర్యాప్తుపై పబ్లిక్‌ ప్రాసిక్యూ టర్లు, లైజనింగ్‌ అధికారులు, పోలీస్‌ అధి కారులతో సమీక్షసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసుల విచారణలో నిందితులకు శిక్షలు పడేలా చేయడంలో పోలీసులతోపాటు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల పాత్ర కూడా అత్యంత కీలకమన్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు నుంచి చార్జిషీట్‌ దాఖలు వరకు జరిగే ప్రక్రియలో ఎలాంటి పొరపాటు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిం చారు. కోర్టులో విచారణ సమయంలో అవసరమైన సాక్ష్యా ధాలు, సాక్షులను సరైనవిధంగా సమర్పించే అంశాలపై ప్రత్యేకదృష్టి సారించాలని సూచించారు. కేసుల్లో దర్యాప్తు సమయంలో బాధితుల వాంగ్మూలాన్ని నమోదుచేసే సమ యంలో పూర్తి జాగ్రత్తలు పాటించాలని, పెండింగ్‌లో కేసుల పరిష్కారంలో ఎక్కడైనా సమన్వయ లోపాలు ఉంటే వెంట నే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. గుడ్‌ ట్రయ ల్‌ మానిటరింగ్‌ సిస్టంద్వారా నిందితులకు శిక్షపడేలా చర్య లు చేపడితేనే బాధితులకు నిజమైన న్యాయం జరుగు తుందన్నారు. న్యాయాధికారులతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ నేరస్థులకు తప్పనిసరిగా శిక్షలుపడే విధంగా ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. భవి ష్యత్‌లో మరింత సమర్థవంతమైన న్యాయవ్యవస్థ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. సమావేశంలో అడిషల్‌డీసీపీ(అడ్మిన్‌) శ్రీనివాస్‌, సీసీఆర్‌పీఇన్‌స్పెక్టర్లు అనిల్‌కుమార్‌, బాబురావు,పబ్లిక్‌ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2026 | 12:22 AM