Share News

Peddapalli: పండించిన ప్రతి గింజను కొంటాం

ABN , Publish Date - May 30 , 2026 | 12:27 AM

మంథని, మే 29 (ఆంధ్రజ్యోతి): రైతులు పండిం చిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఈవిషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేద ని రాష్ట్రఐటీశాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

Peddapalli:  పండించిన ప్రతి గింజను కొంటాం

రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

మంథని, మే 29 (ఆంధ్రజ్యోతి): రైతులు పండిం చిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఈవిషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేద ని రాష్ట్రఐటీశాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంథని మార్కెట్‌యార్డులో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి శ్రీధర్‌బాబు శుక్రవారం సందర్శించి ధాన్యం కొనుగోలు, రైస్‌ మిల్లులకు తరలింపు ఇతర అంశాలపై రైతులు, అధికారులను వివరాలు అడిగి తెలుకున్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. అకాల వర్షంతో తడిచిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని హామీఇచ్చారు. ఈ విషయంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు పర్యట నలు చేస్తూ రైతుల పేరిట రాజకీయాలు చేయడం తగదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వహయాంలో వ్యవసాయం చేయడం పండగలా మారిందన్నారు. రైతన్నలు అందుకే అధిక దిగుబడులు సాధిస్తున్నారని అన్నారు. కొనుగోళ్లపై బీజేపీ, బీఆర్‌ఎస్‌పార్టీలు రాజకీయ చేయడం తగదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ఇబ్బందులను ప్రతిపక్షాలుగా తమదృష్టికి తీసువస్తే ప్రభుత్వపరంగా స్వాగతి స్తామన్నారు. ప్రభుత్వ గోదాంలు సరిపడా లేకపోతే ప్రైవేట్‌ గోదాంలను ఉపయో గించుకుంటున్నా మన్నారు. వరిపంటలు వేయకూదని సోషల్‌ మీడి యాలో జరుగుతున్న ప్రచారానికి ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. వాణిజ్య పంటలు పండిస్తే కూడా రైతులకు లాభదాయకమన్నారు. పొలాల్లో రైతులు వరికొయ్యలను కాల్చడం వలన భూసారం దెబ్బతింటుందని, వాతావారణ కాలుష్యం ఏర్పడు తుందన్నారు.

కార్యక్రమంలో మున్సిపల్‌, ఏఎంసీ, సింగిల్‌ విండో చైర్మన్లు వొడ్నాల శ్రీనివాస్‌, కడుదుల వెంకన్న, కొత్తశ్రీనివాస్‌, ఈఆర్‌సీ మెంబర్‌ శశిభూషన్‌కాచే, ఉప్పట్ల శ్రీనివాస్‌, మండలపార్టీ అధ్యక్షుడు ఐలి ప్రసాద్‌, ఎరుకల ప్రవీణ్‌, పోలుశివ, మంథని సత్యం, నాగినేని జన్మోహన్‌రావు, ఆరెల్లి కొమురయ్యగౌడ్‌, వనం రాంచందర్‌రావు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2026 | 12:27 AM