Peddapalli: సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో సమష్టిగా పని చేస్తున్నాం
ABN , Publish Date - Jan 29 , 2026 | 12:36 AM
గోదావరిఖని, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రివర్గం సమష్టిగా పని చేస్తుం దని, అందరినీ దూరం చేయాలని విపక్షాలు కుట్ర పూరి తంగా సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
గోదావరిఖని, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రివర్గం సమష్టిగా పని చేస్తుం దని, అందరినీ దూరం చేయాలని విపక్షాలు కుట్ర పూరి తంగా సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. బుధ వారం స్థానికఎమ్మెల్యే నివాసం వద్ద వారు విలేకరులతో మాట్లాడారు. సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ పెద్దలు, మంత్రులను అప్రతిష్టపాలు చేసేందుకు వాస్తవదూర కథనాలు అల్లి ప్రచారాలు చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు హరీష్‌రావు, కేటీఆర్ తమ సొంత పత్రికలు, తమ పార్టీకి చెందిన సోషల్‌మీడియాలో ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా సింగరేణిలో అవినీతి అంటూ అపో హలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వీరికి బీజే పీకి చెందిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేదోడుగా ఉంటు న్నాడన్నారు. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత సింగరేణి టెండర్లలో ఏ కొత్త నిబంధన పెట్టలేదని, సైట్ విజిట్ నిబంధన అనేది కోల్ ఇండియామార్గదర్శకం ప్రకారం 2019లోనే పెట్టార న్నారు. కాంగ్రెస్ అదిష్టానం మార్గదర్శకంలో పని చేస్తున్నామన్నారు. రేవంత్ సారథ్యంలో ప్రజలకిచ్చిన ప్రతిహామీని నెరవేర్చే ప్రయ త్నం చేస్తున్నామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలాఉన్నా గత ప్రభుత్వహయాంలోని సంక్షే మ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామ న్నారు.
64ఏళ్లలో 22మంది ముఖ్యమంత్రులు రూ.65వేలకోట్ల అప్పుచేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన పదేళ్లలో రూ.8లక్షలకోట్ల అప్పు చేశారన్నారు. గతంలో ఏడాదికి 6500కోట్ల వడ్డీ కడితే, ప్రస్తుతం నెలకు రూ.6500కోట్ల వడ్డీ కట్టే పరిస్థితిని కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రం ముందు పెట్టింద న్నారు. బీఆర్‌ఎస్‌ను ప్రజలు చీత్కరించుకుంటున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కేటీఆర్ కాంగ్రెస్ పాల నకు రెఫరెండం అని చెప్పగా తమకు అపూర్వ విజయం ఇచ్చి అండగా ఉన్నారన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్ని కల్లో కూడా అన్ని స్థానాల్లో భారీ విజయాలు సాధి స్తామన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలన్నింటిని కైవసం చేసుకుంటామన్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ ఆధ్వర్యంలో మేయర్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంద న్నారు. రాబోయే మూడేళ్లలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తామన్నారు. సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.