Share News

Peddapalli: చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నాం

ABN , Publish Date - Mar 11 , 2026 | 12:39 AM

కాల్వశ్రీరాంపూర్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని కాల్వశ్రీరాంపూర్‌, ఓదెల మండ లాల చివరి ఆయకట్టు పొలాలకు సాగునీరు అందిం చి పంటలను కాపాడుతున్నామని ఎమ్మెల్యే చింత కుంట విజయరమణరావు అన్నారు.

Peddapalli:  చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నాం

- ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు

కాల్వశ్రీరాంపూర్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని కాల్వశ్రీరాంపూర్‌, ఓదెల మండ లాల చివరి ఆయకట్టు పొలాలకు సాగునీరు అందిం చి పంటలను కాపాడుతున్నామని ఎమ్మెల్యే చింత కుంట విజయరమణరావు అన్నారు. మండల కేంద్రం లో మంగళవారం రూ.75లక్షల కలెక్టర్‌ అవైలేబుల్‌ నిధితో నిర్మించిన నూతన తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆయన, జిల్లాకలెక్టర్‌ కోయశ్రీహర్షతో కలిసి ప్రారంభిం చారు. అనంతరం సమావేశంలో ఎమ్మెల్యే మాట్లా డుతూ రేవెల్లి డీ83 నుంచి పెద్దంపూర్‌ చెరువు వరకు రూ.20లక్షలు మంజరు చేసి ఆరున్నర కిలోమీటర్ల మేర కాలువలను తవ్వించామన్నారు. ఇంకో మూడు కిలోమీటర్లు మిగిలిఉందని ఏప్రిల్‌15 తర్వాత 200 క్యూసెక్కుల నీటిని అందించేందుకు ప్రణాళిక చేస్తు న్నామన్నారు. రైతుల పంటల ప్రతి తడికి నీరు ఇచ్చే బాధ్య తనదని ఎమ్మెల్యే అన్నారు. అలాగే ఇదిలాపూర్‌, వెన్నంపల్లి, జాఫర్‌ఖాన్‌పేట, పెద్దరాత్‌పల్లి, డీ83 కాలువ పూడిక తీసి శుభ్రం చేయడం కోసం కోటి రూపాయలు గత సంవత్సరం వెచ్చించినట్లు తెలి పారు. దీంతో ఇదిలాపూర్‌ చెరువు నింపామన్నారు. ఎస్సారెస్పీ అధి కారులు సరిగా పనిచేయడం లేదని సమావేశంలో వారిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా ఎస్సారెస్పీ అధికారులు ఇక్కడే తిష్టవేసి పనిచేయకుండా కాలక్షేపం చేస్తున్నారని వారిని ఇక్కడినుంచి పంపించేందుకు కలెక్టర్‌ దృష్టికి తీసుకుపోయానని తెలిపారు. త్వరలో పార్టీలకతీతంగా పెద్దపల్లి నియోజకవర్గంలోని అన్నిమండలాల్లో రైతు లతో పంటలు, యూరియావాడకంపై ప్రత్యేక సమా వేశం నిర్వహిస్తామన్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లా డుతూ గతం కంటే ఎక్కువ యూరియా రైతులకు అందించినట్లు తెలిపారు. భూభారతిలో 15వేల సమ స్యలను పూర్తి చేశామన్నారు. రెవెన్యూ సిబ్బంది బాగా పనిచేయాలని కలెక్టర్‌ సూచించారు. కార్యక్రమంలో జేసీ వేణు, ఆర్డీవో గంగయ్య, తహసీల్దార్‌ పుల్లూరు జగదీశ్వర్‌రావు, సర్పంచ్‌ బంగారి రమేష్‌, ఏఎంసీ చైర్మన్‌ రామిడి తిరుపతిరెడ్డి, ఎంపీడీవో రాంమోహన్‌ చారి, డిప్యూటీ తహసీల్దార్‌ గర్రెపల్లి శంకర్‌ తదిత రులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌కు బస్సు

ప్రారంభించిన ఎమ్మెల్యే..

కాల్వశ్రీరాంపూర్‌/ఓదెల : కాల్వశ్రీరాంపూర్‌ మండల కేంద్రంలో మంగళ వారం కాల్వశ్రీరాంపూర్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే చింత కుంట విజయ రమణారావు ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దపెల్లి బస్సు డిపో ప్రారంభమైన తర్వాత గతంలో మాదిరిగా గ్రామాలకు బస్సులు నడిపిస్తామన్నారు. ప్రతిరోజు కాల్వశ్రీరాంపూర్‌ నుంచి హైదరాబాద్‌ బస్సు ఉంటుందని ప్రయాణికులు ఈ బస్సును ఉపయోగించుకోవాలన్నారు. కాల్వశ్రీరాం పూర్‌ నుంచి హన్మకొండ బస్సు కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు. అనంతరం బస్సు ఎక్కి ఓదెల మండలం కొలనూర్‌ వరకు ఎమ్మెల్యే ప్రయాణించారు. కార్యక్రమంలో మాజీఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్‌, కరీంనగర్‌ బస్సు డిపోమేనేజర్‌ శ్రీనివాస్‌, కంట్రోలర్‌ లక్ష్మణ్‌, సర్పంచ్‌ బంగారి రమేష్‌, ఏఎంసీ చైర్మన్‌ రామిడి తిరుపతిరెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు సదయ్య, ఆయాగ్రామాల సర్పంచ్‌లు, కాంగ్రెస్‌ నాయ కులు పాల్గొన్నారు. కొలనూర్‌కు వచ్చిన సందర్భంగా సర్పంచ్‌ పల్లెకనకయ్య, కాంగ్రెస్‌ నాయకులు, గ్రామ స్థులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్యేను, బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ను సన్మానించారు.

సుల్తానాబాద్‌కు

కొత్త బస్టాండ్‌ భవనసముదాయం..

సుల్తానాబాద్‌ : సుల్తానాబాద్‌కు కొత్త బస్టాండ్‌ సముదాయాన్ని నిర్మించే విషయాన్ని త్వరలో వెల్లడి స్తామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. కాల్వ శ్రీరాంపూర్‌ నుంచి హైదరాబాద్‌కు ప్రారంభించిన నూతన బస్సు సర్వీసులో ఆయన కాల్వశ్రీరాంపూర్‌ నుంచి సుల్తానాబాద్‌ బస్టాండ్‌కు చేరుకోగా సుల్తానా బాద్‌ మున్సిపల్‌చైర్మన్‌ బిరుదు రాధాక్రిష్ణ, వైస్‌చైర్మన్‌ అంతటి పుష్పలత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్యగౌడ్‌, మార్కెట్‌ చైర్మన్‌ మినుపాల ప్రకాశ్‌రావు తదితరులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మా నించారు. అనంతరం బస్టాండ్‌ పరిసరాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పరిసరాలు పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురు కౌన్సిలరు, నాయకులు, కమిషనర్‌ రమేష్‌ తదితరు లతో కలసి శ్రమదానంచేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ గతంలో శిథిలావస్థకు చేరిన సుల్తా నాబాద్‌ బస్టాండ్‌ స్థానంలో నూతన భవన బస్టాండ్‌ ను నిర్మించనున్నామని ఈమేరకు రాష్ట్రప్రభుత్వంకు ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రస్తుత బస్టాండ్‌ సరిపోవడం లేదని, దీన్ని విస్తరించడమో లేక కొత్తబస్టాండ్‌ నిర్మించడమో చేస్తామని అన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీగిరి శ్రీనివాస్‌, రాజలింగం, అమిరిశెట్టి తిరుపతి, భైరి రవీందర్‌, జక్కుల మధు, కౌన్సిలర్లు ఈర్ల సమత, గాజుల రాజమల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే రైతులకు మేలు..

పెద్దపల్లి టౌన్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే రైతు లకు మేలు జరుగుతోందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కె ట్‌లో మంగళవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ యాంత్రికరణ పనిముటన్లు ఆయన పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ రైతులకు 103యూనిట్లకు గాను కోటి11లక్షల రూపాయల విలువగల సబ్సిడీతో 63మంది రైతులకు రోటోవేటర్లు, గడ్డికట్టలు కట్టే యంత్రాలను అందజేసినట్లు తెలి పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్య గౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ నూగిళ్ల మల్లయ్య, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌, ఏడిఏ శ్రీనాథ్‌, మార్కెట్‌ చైర్మన్లు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, సరఁంచ్‌ లు, ఏవోలు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2026 | 12:39 AM