Share News

Peddapalli: సుల్తానాబాద్‌ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

ABN , Publish Date - Jan 19 , 2026 | 12:28 AM

సుల్తానాబాద్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్‌ పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం తాము కట్టుబడి ఉన్నామని ఈ రెండేళ్లలో పట్టణంలో అనేక శాశ్వత పరమైన అభివృద్ధి పనులు చేసి చూపించా మని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నా రు.

 Peddapalli:   సుల్తానాబాద్‌ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

- రెండేళ్లలో రూ.30కోట్లకు పైగా నిధులు తెచ్చాం

- మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించండి

- ఎమ్మెల్యే విజయరమణారావు

సుల్తానాబాద్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్‌ పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం తాము కట్టుబడి ఉన్నామని ఈ రెండేళ్లలో పట్టణంలో అనేక శాశ్వత పరమైన అభివృద్ధి పనులు చేసి చూపించా మని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నా రు. సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని పది, పన్నెండవ వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇళ్లకు ఆదివారం రాత్రి ఎమ్మెల్యే ముగ్గులు పోసి భూమిపూజ చేశారు. అనంతరం గాంధీనగర్‌లో ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ రెండేళ్లలో సుల్తానాబాద్‌ పట్టణఅభివృద్దికి రూ.30కోట్లు తెచ్చామ న్నారు. వారం పదిరోజుల్లో రూ.21కోట్లతో అభివృద్ధి పనులు మొదలవుతాయన్నారు. దశాబ్దాల తరబడి అభివృద్ధికి నోచుకోని పాతజెండా రోడ్డును డబుల్‌ రోడ్డుగా మార్చామని అన్నారు. పాతజెండా నుంచి మున్సిపల్‌ ఆఫీసు వరకు, పాతజెండా నుంచి గట్టేపల్లిరోడ్డువరకు డబుల్‌రోడ్లు నిర్మించామన్నారు. ఎనిమిదన్నర కోట్లతో ఐబీచౌరస్తా నుంచి గట్టేపల్లి రోడ్డుచౌరస్తా వరకు డబుల్‌రోడ్లు, డివైడర్ల నిర్మాణం, ఐలాండ్ల ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. రూ.80 లక్షల తో ఐబీకాంప్లెక్స్‌ పాతగదులను కూల్చి కొత్తగా గదులు నిర్మించి ఇచ్చామన్నారు. త్వరలోనే సుల్తానా బాద్‌ చెరువు కట్టను మినీట్యాంక్‌ బండ్‌గా మార్చడానికి రూ.8కోట్ల నిధులు రానున్నాయన్నారు. ఇలా వందల కోట్ల నిధులు సుల్తానాబాద్‌ పట్టణ అభివృద్ధికి ఖర్చుచేసే ప్రణా ళికలు తమ వద్ద ఉన్నాయని దశల వారీగా ఈపనులు జరుగుతాయన్నా రు. గాంధీనగర్‌లో 909సర్వే నంబర్లకు సంబంధించి సమస్యను కూడా తాము పరిష్కరించామని అన్నారు. జిల్లాగ్రంథాయల సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్‌తోకలసి తాము ప్రభుత్వం వద్దకు వెళ్లి ప్రజలకు అనుకూలంగా పనులు చేసి జీవో తెచ్చామన్నారు. వారం రోజుల్లో మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ రానుందని అన్నారు. ఈ ఎన్నికలల్లో తాము బలపరి చిన కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించి సుల్తానాబాద్‌ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను మాజీ సర్పంచ్‌ అంతటి పుష్పలత అన్నయ్యగౌడ్‌ దంపతులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ మినుపాల ప్రకాష్‌రావు, శ్రీగిరి శ్రీనివాస్‌, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - Jan 19 , 2026 | 12:28 AM