Share News

Peddapalli: కాంగ్రెస్‌ పార్టీతోనే పట్టణాల అభివృద్ధి

ABN , Publish Date - Feb 08 , 2026 | 12:51 AM

పెద్దపల్లి/సుల్తానాబాద్‌, ఫిబ్రవరి 7 (ఆంరఽధజ్యోతి): బీఆర్‌ఎస్‌ పాలనలో పట్టణాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, కాంగ్రెస్‌పార్టీతోనే పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు అన్నారు.

 Peddapalli:  కాంగ్రెస్‌ పార్టీతోనే పట్టణాల అభివృద్ధి

- పెద్దపల్లి మున్సిపాలిటీలో రూ. 110.44 కోట్లు

- సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలో రూ. 58.61 కోట్లతో పనులు

- పెద్దపల్లిలో కార్నర్‌ మీటింగులో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు

పెద్దపల్లి/సుల్తానాబాద్‌, ఫిబ్రవరి 7 (ఆంరఽధజ్యోతి): బీఆర్‌ఎస్‌ పాలనలో పట్టణాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, కాంగ్రెస్‌పార్టీతోనే పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు అన్నారు. గడిచిన రెండేళ్లలో పెద్దపల్లి మున్సిపాలిటీలో 110.44కోట్లు, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలో 58.61కోట్ల రూపాయలతో అభి వృద్ధి పనులు జరుగుతున్నా యని అన్నారు. చేసిన అభివృద్ధి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమపథకాలు మీకళ్ల ముందు కనబడుతున్నా యని అన్నారు. శనివారం ఆయన పెద్దపల్లి పట్టణంలోని 2, 8, 9, 21వ వార్డుల అభ్యర్థులు పస్తెం లక్ష్మి, ఎరుకల కల్పన, ఎండీ నదీమ్‌, నూగిళ్ల మల్లయ్య, సుల్తానాబాద్‌ పట్టణంలోని 1, 6, 8, 9, 10వ వార్డుల్లో అభ్యర్థులు ఈర్ల స్వరూప, బాకం సాయి కిరణ్‌, చింతల రాజు, తొర్రికొండ ప్రభాకర్‌, అంతటి పుష్పలత అన్నయ్యగౌడ్‌ తరపున ప్రచారం నిర్వహించి కార్నర్‌ మీటింగుల్లో మాట్లాడారు. పెద్దపల్లి, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీల్లో మౌలిక వసతులు కల్పించడంలో పట్టించుకోలేదని, తమ స్వార్థం కోసం వారికి పనికి వచ్చే పనులు చేశారని విమర్శించారు. పట్టణంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేయడమే కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని అన్నారు. గడిచిన పదేళ్లలో జరగని అభివృద్ధి, రెండేళ్లలోనే చేశామన్నారు. ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ప్రోత్సాహంతో టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా రూ.30కోట్లు, యూఐడీఎఫ్‌ ద్వారా రూ.62.23 కోట్లు, అమృత్‌2.0ద్వారా 25.62 కోట్లు, డీఎంఎఫ్‌టీ ద్వారా రూ.15కోట్లు తీసుకవచ్చి ప్రధాన రహదారులు, వీధుల్లో సీసీ రోడ్లు, మురికి కాలువలు, స్ట్రీట్‌ లైట్లు, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌, స్మశాన వాటికలు, తాగునీటి వసతి కల్పించేం దుకు పైపులైన్లు, ఎస్టీపీ నిర్మాణాలు చేపట్టామన్నారు. చందపల్లి, రాంపెల్లి డబుల్‌బెడ్‌ రూముల భవన సముదాయాల వద్ద మౌలికవసతులకు రూ.3.62కోట్లు వెచ్చించి లబ్ధిదారులను గృహప్రవేశం చేయించామన్నారు. సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలో టీయూఎఫ్‌ఐడీ ద్వారా రూ.5కోట్లు, నగరాభివృద్ధి నిధులద్వారా రూ.15కోట్లు, డీఎం ఎఫ్‌టీ ద్వారా రూ.6.68కోట్లు, 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.1.53కోట్లు, సుల్తానాబాద్‌ చెరువును మినీట్యాంకు బండ్‌గా మార్చేందుకు రూ.8కోట్లు, ఐబీ భవనానికి రూ.4 కోట్లు మంజూరు చేయించానని అన్నారు. ఆ పనులన్నీ మీ కళ్ల ముందున్నాయని అన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, జీరో వడ్డీకే రుణాలు అందిస్తున్నామన్నారు. 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, రైతులకు 2లక్షలవరకు రుణమాఫీ చేసి, 9రోజుల్లోనే రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు జమ చేశామన్నారు. సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్‌ ఇస్తున్న ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కిందన్నారు. పట్టణాల్లోనే గాకుండా గ్రామాల్లో కూడా కోట్ల నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇంకా మరెన్నో అభివృద్ధి పనులు చేసుకోవాల్సి ఉందన్నారు. దేశంలోనే రాష్ట్రాన్ని ముందుంచేందుకు సీఎం రేవంత్‌రెడ్డి విజన్‌-2047తో ముందుకుపోతున్నారని అన్నారు. మాయ మాటలు చెప్పి మోసంచేస్తారని, వారిమాయల్లో చిక్క వద్దన్నారు. ‘గడ్డి గాడిదకు వెసి బర్రె పాలు పితికితే పాలురావు’ అన్నారు. వచ్చేఐదేళ్లలో కూడా కాంగ్రెస్‌ పార్టీయే అధికారంలోకి వస్తుందని, పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి అత్యఽధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. కార్నర్‌ మీటింగులకు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు, ప్రజలు హాజరయ్యారు.

Updated Date - Feb 08 , 2026 | 12:51 AM