Peddapalli: సమ్మక్క జాతరలకు పటిష్టమైన బందోబస్తు
ABN , Publish Date - Jan 23 , 2026 | 12:46 AM
సుల్తానాబాద్/ ఓదెల/ కాల్వశ్రీరాంపూర్, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): సమ్మక్కసారలమ్మ జాతర లలో ఎలాంటి అవాంఛనీయ సంఘ టనలు జరగకుండా పోలీస్‌శాఖ చర్యలు తీసుకుంటుందని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి అన్నారు.
- ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావుండొద్దు
- పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి
సుల్తానాబాద్/ ఓదెల/ కాల్వశ్రీరాంపూర్, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): సమ్మక్కసారలమ్మ జాతర లలో ఎలాంటి అవాంఛనీయ సంఘ టనలు జరగకుండా పోలీస్‌శాఖ చర్యలు తీసుకుంటుందని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి అన్నారు. గురువారం ఆయన సుల్తానాబాద్ మండలం నీరుకుళ్ల, ఓదెల మండలంలోని కొల నూర్, కాల్వశ్రీరాంపూర్ మండంలోని మీర్జంపేటలోని సమ్మక్క, సారలమ్మ జాతర ప్రదేశాలని సందర్శించారు. జాతర ప్రాంగణం అంతా ఆయన తిరిగి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిం చారు. ముఖ్యంగా భక్తుల భధ్రత రక్షణ చర్యలతోపాటు ట్రాఫిక్ క్రమబద్దీకరణపై ఆయన పలు సలహాలు సూచనలు చేశారు. జాతరకు ఎంత మంది భక్తులు వచ్చేది ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. జాతరప్రాంగణంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయి స్తున్నామని. భక్తులు, ముఖ్యంగా మహిళల భద్రత, రక్షణవిషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, పోలీసుల సూచనలు పాటించాలని అన్నారు. జాతర సందర్భంగా వాహనాలను పోలీసులు నిర్ణయించిన స్థలాల్లో పార్కిం గ్ చేయాలని సూచించారు. వన్‌వే ఉంటుందని, ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. సుల్తానాబాద్ నుంచి నీరుకుళ్ల జాతర ప్రాంగణం వరకు ఒకరూటు, మళ్లీ దర్శనం చేసుకున్న వారందరూ కోమండ్లపల్లి రంగంపల్లి మీదుగా వెళ్లాల్సి ఉంటుంద న్నారు. కొలనూర్‌లో సమ్మక్క, సారలమ్మ గద్దెలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక్కడ జాతర విశేషాలను స్థానికులను అధికారులు అడిగి తెలుసుకున్నారు. మీర్జంపేటలో సమ్మక్క సారలమ్మ జాతర పోస్టర్‌లను ఆవిష్కరించారు. డీసీపీ వెంట పెద్దపల్లి ఏసీపీ గజ్జి క్రిష్ణ, సీఐ సుబ్బారెడ్డి, ఎస్‌ఐ చంద్రకుమార్ పొత్కపల్లి ఎస్‌ఐ ధీకొండ రమేష్, తదితరులున్నారు.