Peddapalli: ధాన్యం కొనుగోళ్లలో జాప్యానికి తావులేదు
ABN , Publish Date - May 28 , 2026 | 12:23 AM
సుల్తానాబాద్, మే 27 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లలో జాప్యానికి తావులేదని ప్రభుత్వవిప్ చింతకుంట విజయరమ ణారావు అన్నారు.
- ప్రభుత్వ విప్ విజయరమణారావు
సుల్తానాబాద్, మే 27 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లలో జాప్యానికి తావులేదని ప్రభుత్వవిప్ చింతకుంట విజయరమ ణారావు అన్నారు. బుధవారం సుల్తానాబాద్ లారీ అసోసియే షన్ కార్యాలయంలో లారీఅసోసియోషన్ ప్రతినిధులు రైస్ మిల్లర్లతో సమావేశం ఏర్పాటుచేశారు. పెద్దపల్లి నియోజక వర్గంలో ఇప్పటివరకు కొనసాగిన ధాన్యం కొనుగోళ్లపై సమీ క్షించారు. అనంతరం ప్రభుత్వవిప్ మాట్లాడుతూ ధాన్యం తర లించేందుకు లారీఅసోసియేషన్ వారు టెండర్లు దక్కించుకుని 170లారీలు సమకూరుస్తామని చెప్పారన్నారు. కానీక్షేత్రస్థా యిలో కనీసం వందలారీలు కూడా కనిపించడం లేదని అసం తృప్తి వ్యక్తంచేశారు. లారీఅసోసియేషన్ వారు స్పందించి ప్రతీమిల్లుకు ఒకలారీచొప్పున మిగిలిన ధాన్యాన్ని ఐదారురో జుల్లో మిల్లులకు తరలించాలన్నారు. ఈ ఐదురోజుల్లో కొను గోళ్ల ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. సమావేశంలో రైస్‌మిల్ల ర్లసంఘం జిల్లా అధ్యక్షుడు నగునూరి అశోక్, జయపాల్‌రెడ్డి, మాడూరి ప్రసాద్, మార్కెట్‌చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, సింగిల్‌విండోచైర్మన్ శ్రీగిరిశ్రీనివాస్, లారీఅసోసియేషన్ అధ్య క్షుడు కంకనాల తిరుపతి, గుర్రాలశ్రీనివాస్, కనవేనిసతీష్, అంజనేయులు,శేఖర్,సీఐ రంజిత్‌రావు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ప్రతిగింజ కొంటాం..
కాల్వశ్రీరాంపూర్: రైతులు ధైర్యంగా ఉండాలి.. పండించిన ప్రతిగింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుం దని ప్రభుత్వవిప్,ఎమ్మెల్యే విజయరమణారావు అన్నా రు. బుధవారం మండలకేంద్రంలో వ్యవసాయ మార్కె ట్‌లో మక్కలకొనుగోళ్లను పరిశీలించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ మార్కెట్‌యార్డుకు వస్తున్న మక్క ల దిగుమతి ప్రక్రియను అఽధికారులు మరింత వేగ వంతం చేయాలన్నారు. కలెక్టర్‌తో ఆయన ఫోన్ మాట్లా డి, సమస్యవివరించారు. వర్షాకాలం సమీపిస్తున్నందున రైతులు తెలుస్తున్న మొక్కజొన్నలు తడవకుండా జాగ్ర త్తలు తీసుకోవాలని, మార్కెట్‌యార్డుల్లో మౌళికవసతు లు కల్పించాలని అధికారులకు సూచించారు. అనంతరం ఏఎంసీడైరెక్టర్‌గా ద్యాగేటి రామచంద్రం తండ్రిజానయ్య మృతిచెందగా మృతునికుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్ర మంలో మాజీఎంపీపీ గోపగానిసారయ్యగౌడ్, సర్పంచ్ బంగా రి రమేష్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, సింగిల్‌విండోచైర్మన్ చదువు రాంచంద్రరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడుగాజనవేన సదయ్య, రైతులు పాల్గొన్నారు.
పరామర్శ..
ఓదెల: మండలంలోని రూపునారాయణపేటలో బుధ వారం ప్రభుత్వవిప్ చింతకుంట విజయరమణారావు పలు కుటుంబాలను పరామర్శించి నివాళులర్పించారు. దాగేటి జానయ్య అనారోగ్యంతో ఇటీవల మృతిచెందగా వారి కుటుం బాన్ని పరామర్శించారు. గ్రామంలో ఇటీవల మృతిచెందిన కుటుంబాలను పరామర్శించి ఓదార్చి నివాళులర్పించారు.
ఎల్లమ్మతల్లికి పూజలు..
జూలపల్లి : మండలంలోని పెద్దాపూర్‌లో రేణుకా ఎల్లమ్మతల్లి బోనాలను బుధవారం గౌడకులస్తులు ఘనంగా జరుపుకున్నారు. ఈవేడుకకు విచ్చేసిన ప్రభుత్వవిప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆలయంలో ప్రత్యేక పూజలుచేసి మొక్కులను తీర్చుకున్నారు.