Share News

Peddapalli: రైతులకు సాగునీరందించడంలో రాజీపడేది లేదు

ABN , Publish Date - Jun 01 , 2026 | 01:20 AM

సుల్తానాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి నియోజకవర్గ రైతులకు ప్రయోజనం చేకూర్చడంలో గానీ, వారి పంటలకు సాగు నీరందించడంలో గానీ రాజీపడే ప్రసక్తేలేదని ప్రభుత్వవిప్‌ విజయరమణా రావు స్పష్టం చేశారు.

Peddapalli: రైతులకు సాగునీరందించడంలో రాజీపడేది లేదు

సుల్తానాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి నియోజకవర్గ రైతులకు ప్రయోజనం చేకూర్చడంలో గానీ, వారి పంటలకు సాగు నీరందించడంలో గానీ రాజీపడే ప్రసక్తేలేదని ప్రభుత్వవిప్‌ విజయరమణా రావు స్పష్టం చేశారు. సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లిలో ఆదివారం సాయంత్రం ఎల్లమ్మ చెరువు ప్రాంతంలో పురాతన కాలువ పూడికతీత పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 15నుంచి ఇరవై ఏళ్ల నుంచి ఎల్లమ్మ కాలువ పూడిక తీత పనులు చేపట్టలేదని ఫలితంగా చెరువు ఆయకట్టపై ఆధారపడిన మండ లంలోని గర్రెపల్లి, బొంతకుంటపల్లి, రంగంపల్లి, కోమండ్లపల్లి, గ్రామాలకు చెందిన రైతులు వారి పొలాలను బీడ్లుగా వదిలేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింద న్నారు. ఈ గ్రామాల చివరి ఆయకట్టు భూములకు సైతం సాగునీరందించే విధంగా ఎల్లమ్మ చెరువు కాలువ పూడికతీత పనులు చేపడతామన్నారు. ఈ కాలువ సైతం కబ్జాకు గురయిందన్నారు. వేలాది ఎకరాలు ఏటా ఎండిపోతున్న విషయాన్ని రైతులు తనదృష్టికి తేవడంతో ఈ సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నానని చెప్పారు. ప్రస్తుతం ఇరవైలక్షలు కేటాయించామని, మరి కొన్ని రోజుల్లో మరో15లక్షలు మంజూరు చేస్తామన్నారు. వర్షాలు కురియకముందే పనులు చేపట్టాలని, ఎస్సారెస్పీ అధికారులు పనులను పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమం లో సర్పంచ్‌ వీరగోని రమేష్‌ గౌడ్‌ రైతులు పాల్గొన్నారు.

సుల్తానాబాద్‌లో యాగశాలను

ప్రారంభించిన విప్‌..

సుల్తానాబాద్‌ పట్టణంలోని పెరికిగిద్ద ఆంజనే యస్వామి అలయం సమీపంలో ఉన్న శ్రీధర్మశాస్త్ర గోశాలలో నూతనంగా నిర్మించిన యాగశాలను ఆదివారం ప్రభుత్వవిప్‌ విజయరమణారావు ప్రారంభించారు. యాగశాలలో నిర్వహిస్తున్న చండీయాగంలో ఆయన కొంతసేపు పాల్గొన్నారు. ప్రత్యేకపూజలు చేశారు. గోశాల నిర్వాహకులు బండారి సూర్య తదితరులు ఆయనకు ఘనస్వాగ తంపలికి సన్మానించారు. యాజ్ఞికులు ఉప్పర మల్యాల లక్ష్మణశర్మ ఆధ్వర్యంలో చంఢీయాగం నిర్వహించి పూర్ణహుతి నిర్వహించారు. కార్యక్ర మంలో మాజీజడ్పీటీసీ డాక్టర్‌ ఐల రమేష్‌, మున్సిపల్‌ చైర్మన్‌ బిరుదు రాధాక్రిష్ణ, సాయిరి మహేందర్‌, కౌన్సి లర్లు బాకం సాయి కుమార్‌, అబ్బయ్య గౌడ్‌, వూట్కూరి శంకరశర్మ, లెక్కల పల్లవి గంగాధర్‌, కత్తెర్ల పోచన్న మిట్టపల్లి మురళి, తదితరులు పాల్గొన్నారు. యాగశాలను నిర్మించిన దాతలను ఘనంగా సన్మానించారు.

Updated Date - Jun 01 , 2026 | 01:20 AM