Peddapalli: పారిశుధ్య కార్మికుల సేవలు వెల కట్టలేనివి
ABN , Publish Date - Apr 15 , 2026 | 11:21 PM
సుల్తానాబాద్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుధ కార్మికులు చేస్తున్న సేవలు అమూల్యమైనవని ఆ సేవలకు వెల కట్టలే మని బీజేపీ పెద్దపల్లిజిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవ రెడ్డి అన్నారు.
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి
సుల్తానాబాద్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుధ కార్మికులు చేస్తున్న సేవలు అమూల్యమైనవని ఆ సేవలకు వెల కట్టలే మని బీజేపీ పెద్దపల్లిజిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవ రెడ్డి అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని మున్సి పాలిటీ కార్యాలయం ఎదురుగా బుధవారం అంబే డ్కర్ జయంతి వారోత్సవాల్లో భాగంగా మున్సిపాలి టీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల కాళ్లను బీజేపీ నేతలు కడిగి ఆ నీటిని నెత్తిన చల్లుకున్నారు. అనంతరం వారందరినీ ఘనంగా శాలువాలతో సన్మానించారు. టిఫిన్‌బాక్స్‌లను బహూకరించారు. నలభైమంది పారిశుధ్య కార్మికులను ఒక్కొక్కరిని వేదికపైన ఏర్పాటు చేసిన ఆసనంలో కూర్చుండబెట్టి పెద్దపల్లి బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి ఆద్వర్యంలో పలువురు నేతలు వారి కాళ్లను కడిగి ఆ నీళ్లను నెత్తిన చల్లుకున్నారు. పార్టీ పిలుపుమేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని నేతలు తెలిపారు. జిల్లాఅధ్యక్షుడు సంజీవరెడ్డి మాట్లా డుతూ దేశంలోకానీ ప్రపంచంలో కానీ పారిశుధ్య కార్మికుల పాదాలను కడిగిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది మనదేశ ప్రధాని నరేంద్రమోదీ ఒక్కరేనని అన్నారు. కార్యక్రమ కన్వీనర్ ఎనగందలు ఎల్లయ్య, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్, కాసగోని నిర్మల, మన్‌కీబాత్ కన్వీనర్ మిట్టపల్లి ప్రవీణ్‌కుమార్, మాజీఎంపీపీ రేణుకదేవి, పుచ్చ కాయల హన్మాంతరెడ్డి, కోట నాగేశ్వర్, లంక శంకర్, బండారి లత, ఎర్రం సంతోష్‌రెడ్డి, శ్రీనివాస్, ఆగండ్ల గట్ట య్య, మాటూరి వెంకటస్వామి, గోస్కుల రవి, కొము రయ్య, దాసరి చందు పాల్గొన్నారు.