Share News

Peddapalli: పీటీ స్వామి సేవలు చిరస్మరణీయం

ABN , Publish Date - Nov 02 , 2026 | 12:09 AM

కళ్యాణ్‌నగర్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన పీటీ స్వామి విరామం ఎగురని శ్రామికుడని, ఆయన మరణం బీఆర్‌ఎస్‌ పార్టీకి, సింగరేణి కార్మికలోకానికి తీరని లోటని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ శాసనసభపక్ష ఉపనేత తన్నీరు హరీష్‌రావు అన్నారు.

Peddapalli:  పీటీ స్వామి సేవలు చిరస్మరణీయం
మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్‌రావు

ఖనిలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాం...

మాజీమంత్రి హరీష్‌రావు

కళ్యాణ్‌నగర్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన పీటీ స్వామి విరామం ఎగురని శ్రామికుడని, ఆయన మరణం బీఆర్‌ఎస్‌ పార్టీకి, సింగరేణి కార్మికలోకానికి తీరని లోటని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ శాసనసభపక్ష ఉపనేత తన్నీరు హరీష్‌రావు అన్నారు. గోదావరి ఖని దుర్గానగర్‌లోని ఒక ప్రైవేట్‌ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన పీటీ స్వామి సంస్మరణ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రసమితి ఆవి ర్భావం నుంచి చివరిశ్వాస వరకు పార్టీలోనే కొనసాగిన, నిబద్ధత కలిగిన నాయకుడు పీటీ స్వామి అన్నారు. పేదలపక్షపాతిగా సింగరేణి కార్మి కుల సమస్యల పరిష్కారం కోసం పారిశ్రా మిక ప్రాంతంలో పార్టీ బలోపేతం కోసం ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. మాజీముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యంత గౌర వించే నాయకుల్లో పీటీ స్వామి ఒకరని గుర్తు చేశారు. 80ఏళ్ల వయసులో కూడా కార్మికుల సమస్యలపై పోరాడుతూ వృద్ధుల సంక్షేమం కోసం ఆశ్ర మాన్ని నిర్వహించడం ఆయన సేవానిరతికి నిదర్శనమ న్నారు. పీటీస్వామి సేవలను చిరస్మరణీయం చేసేలా గోదావరిఖనిలో ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు. విగ్రహం ఏర్పాటుకు సంబంధించిన పూర్తి బాధ్యతను పార్టీ తీసు కుంటుందని, అదేవిధంగా పీటీస్వామి కొనగించిన ఈశ్వ రకృప వృద్ధాశ్రమ నిర్వహ ణకు కూడా తనపూర్తి సహ కారం అందిస్తానని హామి ఇచ్చారు. మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లా డుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పీటీస్వామి అలుపెరుగని పోరాటం చేశారని, 7ఎల్‌ఈపీ బొగ్గుగని ప్రమాదం జరిగినప్పుడు కార్మికులకు న్యాయంచేయాలని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయిని అడ్డుకుని నిరసన తెలిపిన ఘటనలో తనతో పాటు పీటీ స్వామి జైలు జీవితం గడిపారని గుర్తుచేశారు. తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువు పీటీ స్వామి అని, ఆయన మరణం వ్యక్తిగతంగా తనకు, పార్టీకి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సంతాపసభలో మాజీఎమ్మెల్యేలు పుట్ట మధుకర్‌, దాసరి మనోహర్‌రెడ్డి, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాజీచైర్మన్‌ కోలేటి దామోదర్‌, టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, మాజీ ఎస్సీ కమిషన్‌ సభ్యుడు కొంకటి లక్ష్మీ నారాయణ, నాయకులు మాదాసురామమూర్తి, వడ్డేపల్లి శంకర్‌, మూల విజయారెడ్డి, హరి, జేవీరాజు, హరీష్‌రెడ్డి, పర్లపల్లి రవి పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2026 | 12:09 AM