Share News

Peddapalli : బడిగంట మోగింది...

ABN , Publish Date - Jun 15 , 2026 | 01:40 AM

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) బడి గంట మోగింది. వేసవి సెలవుల్లో ఆటాపాటలతో గడిపిన విద్యార్థులు మళ్లీ పాఠ శాలల బాట పట్టనున్నారు.

 Peddapalli :  బడిగంట మోగింది...

నేటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు

ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం పథకానికి శ్రీకారం

చేరిన పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులు

ఇంకా అందని కిట్లు, యూనిఫాం క్లాత్‌

ప్రైవేట్‌ స్కూళ్ల ఫీజుల దోపిడీపై నియంత్రణ కరువు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

బడి గంట మోగింది. వేసవి సెలవుల్లో ఆటాపాటలతో గడిపిన విద్యార్థులు మళ్లీ పాఠ శాలల బాట పట్టనున్నారు. ఎండల తీవ్రత కారణంగా ఈ నెల 12న ప్రారంభం కావాల్సిన పాఠశాలలను ప్రభుత్వం మూడు రోజుల పాటు వాయిదా వేసి, 15 నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. దీంతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు విద్యార్థుల రాకతో సందడిగా మారనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపునకు ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు అమలులో ఉన్న మధ్యాహ్న భోజన పథకంతో పాటు విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఉద యం పూట ఆకలి సమస్య లేకుండా విద్యార్థులు తరగతులకు హాజరయ్యేలా ఈ పథకం దోహద పడుతుందని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో 30 వేల మందికి పైగా విద్యార్థులు ఉండగా జిల్లా విద్యాశాఖ పరిధిలో మొత్తం 528 పాఠశాలలు కొనసాగుతున్నాయి. వీటిలో 30,448 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తు న్నారు. అందులో 324 ప్రాథమిక పాఠశాలల్లో 9,341 మంది, 83 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 3,993 మంది, 104 ఉన్నత పాఠశాలల్లో 10,867 మంది, 10 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాల యాల్లో 2,844 మంది, ఏడు మోడల్‌ స్కూళ్లలో 3,403 మంది చదువుతున్నారు. వీటిలో ఈ ఏడాది మరికొంత మంది విద్యార్థులు చేరనున్నారని అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో విద్యార్థులు పైవ్రేట్‌ పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాలని నిర్వహించిన బడిబాట కొంతమంది వచ్చే అవకాశం ఉన్నది. ఓదెల మండలం శానగొండ గ్రామ సర్పంచ్‌ రాజు ప్రభుత్వ పాఠశాలలో చేరే విద్యార్థులకు 2వేల రూపాయల నజరానా ఇస్తామని ప్రకటించారు. ధర్మారం మండలం పెర్కపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యు లు, గ్రామస్తులు కలిసి తమ పిల్లలను సర్కారు బడికి పంపిస్తామని తీర్మానం చేశారు.

ఫ పుస్తకాలు సిద్ధం.. ఏకరూప దుస్తుల్లేవు

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కు లు ఇప్పటికే పాఠశాలలకు చేరాయి. అయితే విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన 21 రకాల వస్తువులతో కూడిన విద్యా కిట్లు ఇంకా జిల్లాకు చేరలేదు. అలాగే ప్రతి ఏడాది అందించే రెండు జతల ఏకరూప దుస్తులకు సంబంధించిన క్లాత్‌ కూడా ఇప్పటి వరకు సరఫరా కాలేదు. దీంతో విద్యార్థులు గత విద్యా సంవత్సరంలో అందు కున్న యూనిఫాంలతోనే కొత్త విద్యా సంవ త్సరాన్ని ప్రారంభించాల్సిన పరిస్థితి నెలకొంది.

ఫ ప్రైవేట్‌ పాఠశాలల్లో ఆగని దోపిడీ

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పలుమార్లు ప్రకటించినప్పటికీ ఆ దిశగా స్పష్టమైన చర్యలు కనిపించడం లేదు. ఫలితంగా ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో యథేచ్ఛగా దోపిడీ కొనసాగుతు న్నది. ఈ ఏడాది కూడా తరగతుల వారీగా 10 నుంచి 20 శాతం వరకు ఫీజులు పెంచినట్లు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల ఆవరణల్లోనే బుక్‌ స్టాళ్లు ఏర్పాటు చేసి నోట్‌బుక్కులు, యూనిఫాంలు, టైలు, బెల్టులు, షూస్‌ విక్రయిస్తూ అదనపు భారం మోపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫీజులతోపాటు ఇతర ఖర్చులు కూడా పెరగడంతో మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

ఫ పెరుగుతున్న ప్రీపైమ్రరీ పాఠశాలలు

మూడేళ్లు పైబడిన చిన్నారులకు ప్రాథమిక విద్యను అందించేందుకు ప్రభుత్వం గత ఏడాది జిల్లాలో 48 ప్రీపైమ్రరీ స్కూళ్లను ప్రారంభిం చింది. ఈ ఏడాది కూడా మరో 48 కేంద్రాలను ఏర్పాటు చేయనుండటంతో జిల్లాలో ప్రీపైమ్రరీ స్కూళ్ల సంఖ్య 98కి చేరనుంది. చిన్నారులను ప్రభుత్వ విద్యా వ్యవస్థ వైపు ఆకర్షించేందుకు ఈ చర్యలు దోహదపడనున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. విద్యా సంవత్సరం ప్రారం భానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ కిట్లు, యూనిఫాం క్లాత్‌ సరఫరా, ప్రైవేట్‌ పాఠశాలల ఫీజుల నియంత్రణ వంటి అంశాలు ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలాయి. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - Jun 15 , 2026 | 01:40 AM