Share News

Peddapalli: భక్తి మార్గమే ముక్తికి బాట..

ABN , Publish Date - Nov 02 , 2026 | 12:11 AM

మంథని రూరల్‌, నవంబర్‌ 1 (ఆంధ్రజ్యోతి): భగవంతుడు సర్వాంతర్యామి అని, నిస్వార్థంగా ప్రార్థించే భక్తుల కోరికలను నెరవేరుస్తాడని గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు.

 Peddapalli: భక్తి మార్గమే ముక్తికి బాట..
మాట్లాడుతున్న గణపతి సచ్చిదానంద స్వామీజీ

ధన్వాడ, మంథనిలో గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్యాత్మిక సందేశం

స్వామివారి రాకతో ఆధ్యాత్మిక శోభ.. భక్తులకు ఆశీర్వచనాలు

మంథని రూరల్‌, నవంబర్‌ 1 (ఆంధ్రజ్యోతి): భగవంతుడు సర్వాంతర్యామి అని, నిస్వార్థంగా ప్రార్థించే భక్తుల కోరికలను నెరవేరుస్తాడని గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. ప్రతిఒక్కరూ ధర్మ బద్ధమైన జీవితాన్ని గడుపుతూ అహింసా మార్గాన్ని అనుసరించాలని అన్నారు. ఆదివారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆహ్వానం మేరకు భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ, మంథనిలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో స్వామీజీ పాల్గొన్నారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో ధన్వాడకు చేరుకున్న స్వామీజీకి మంత్రి శ్రీధర్‌బాబు స్వాగతం పలికారు. అనంతరం దత్తాత్రేయ స్వామి ఆలయంలో లోకకల్యాణం కోసం నిర్వహించిన మహా పూర్ణాహుతియజ్ఞంలో పాల్గొని ప్రత్యేకపూజలు చేశారు. భగవంతుడు ప్రతీఒక్కరి హృదయంలో ఉంటాడని, భక్తులు సమర్పించే నైవేద్యాన్ని స్వీకరించి వారికి విజయాన్ని ప్రసాదిస్తాడని వివరించారు. అనంతరం మంథనిలోని శివకిరణ్‌ గార్డెన్స్‌కు చేరు కుని భక్తులకు ప్రవచనాలు అందించి ఆశీర్వదించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామీజీని దర్శించుకున్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ స్వామీజీ మంథని, ధన్వాడ ప్రాంతాలకు రావడం ప్రజల అదృష్టమన్నారు. రెండుమూడేళ్లుగా తనతల్లి జయశ్రీ, సతీమణి, కుటుంబ సభ్యులు స్వామీజీ రాకకోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ధన్వాడలో దత్తా త్రేయ స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేసిన తర్వాత స్వామీజీ పూర్ణాహుతిలో పాల్గొనడం ప్రత్యేకమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలతోపాటు ఉమ్మడి కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలు, ముఖ్యంగా మంథని, ధన్వాడ ప్రాంతప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్ర మంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్‌ మక్కా న్‌సింగ్‌ దంపతులు, మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ సతీమణి, జిల్లా కలెక్టర్‌, రామగుండం పోలీస్‌ కమిషనర్‌, స్థానిక ఆధ్యాత్మికవేత్తలు, రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతి నిధులు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2026 | 12:11 AM