Share News

Peddapalli: కార్మికుల కనీస వేతనం రూ.26వేలుగా నిర్ణయించాలి

ABN , Publish Date - Feb 19 , 2026 | 12:36 AM

జ్యోతినగర్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనం రూ.26వేలుగా సవరించాలని ఎన్టీపీసీ టీటీఎస్‌లోని కేంద్ర అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌కు బుధవారం సీఐటీయూ రాష్ట్ర కమిటీ తర పున వినతిపత్రం అందించారు.

Peddapalli: కార్మికుల కనీస వేతనం రూ.26వేలుగా నిర్ణయించాలి

జ్యోతినగర్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనం రూ.26వేలుగా సవరించాలని ఎన్టీపీసీ టీటీఎస్‌లోని కేంద్ర అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌కు బుధవారం సీఐటీయూ రాష్ట్ర కమిటీ తర పున వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి బలు గూరి మధు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం 2017జనవరిలో కనీస వేతన చట్టం జీవో విడుదల చేసిందన్నారు. ఐదేళ్లకోసారి కనీసవేతనాలు సవరిం చాల్సిన కేంద్రప్రభుత్వం ఐదేళ్లు దాటి, నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు వేతన సవరణ జరగలేదని విమర్శించారు. ప్రస్తుతం వేరి యబుల్‌ డీఏ బేసిక్‌లో 50శాతం మించి పోయిందన్నారు. ప్రస్తుతం చెల్లి స్తున్న ఏదీ కూడా మార్కెట్‌లో వాస్తవంగా పెరుగుతున్న ధరలను ప్రతి బింబించడం లేదన్నారు. దీంతో కార్మికుల కుటుంబాల జీవనంలో ఎలాంటి ఎదుగుదల లేదన్నారు. వారిని దృష్టిలో కనీసవేతనాలు రూ.26వేలకు తగ్గకుండా కేంద్రం వెంటనే నిర్ణయం చేయాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూజిల్లాఉపాధ్యక్షులు భిక్షపతి, రాష్ట్రకమిటీ సభ్యులు రామాచారి, రామగుండం ఇండస్ర్టీయల్‌ వర్కర్స్‌ యూనియన్‌ సీఐటీయూ అధ్యక్షుడు యాకుబ్‌, ప్రధానకార్యదర్శి లక్ష్మారెడ్డి, కిషోర్‌, జగదీశ్వర్‌, అశోక్‌ రాజు, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 19 , 2026 | 12:36 AM