Peddapalli: గ్రామ, వార్డుసభల ద్వారా ప్రభుత్వ సందేశం ప్రతీ ఇంటికి చేరాలి
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:20 AM
జ్యోతినగర్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నిర్వ హించనున్న గ్రామసభలు, వార్డుసభల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమపథకాలపై సందేశం ప్రతిఇంటికి చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్
- కలెక్టర్ కోయశ్రీహర్ష
జ్యోతినగర్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నిర్వ హించనున్న గ్రామసభలు, వార్డుసభల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమపథకాలపై సందేశం ప్రతిఇంటికి చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. బుధవారం ఎన్టీపీసీ కాకతీయ ఫంక్షన్‌హాల్‌లో అదనపుకలెక్టర్ అరుణశ్రీతో కలిసి జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీ వోలు, వ్యవసాయ, పోలీస్, వైద్య, విద్యుత్, నీటిపారుదల శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామపంచాయతీలు, మున్సి పల్, పట్టణప్రాంతాల్లో వడదెబ్బ కారణంగా మరణిస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తుం దన్నారు. దీనిమంజూరుకు ఎఫ్‌ఐఆర్, పోస్టుమార్టం నివేదిక, మరణ ధ్రువీకరణపత్రం తప్పనిసరిగా ఉండాల న్నారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శులు ప్రజ లకు విస్తృతంగా ప్రచారం కల్పించాలన్నారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకాన్ని పూర్తిస్థాయిలో వినియో గించుకోవాలని తెలిపారు. కుటుంబంలో మరణం సంభ వించిన అర్హులైన కుటుంబాలకు రూ.20వేల ఆర్థిక సహా యం అందుతుందన్నారు. మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఎంపీడీవో, తహసీల్దార్ ద్వారా మంజూ రుకు అవకాశం ఉంటుందన్నారు. అలాగే ఈనెల4,6,8,10 తేదీల్లో నిర్వహించే గ్రామ వార్డుసభలను విజయవంతం చేయాలని తెలిపారు. ఎస్‌ఐఆర్ ద్వారా ప్రతి ఓటు రక్షణ, సమర్పించాల్సిన పత్రాలు, దరఖాస్తు తదితర అంశాలను గ్రామసభల్లో పూర్తిస్థాయిలో వివ రించాలన్నారు. వ్యవసాయ అధికారులు తక్కు వ వర్షపాతం సమయాల్లో అనుసరించాల్సిన ప్రత్యామ్నయ పంటల ప్రణాళికలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జూలై 15, 30, ఆగస్టు 15 నాటికి సాధారణ వర్షాలు నమోదు కానిపక్షంలో ఎలాంటి పంటలుసాగు చేయా లనే వాటిపై దశలవారి కార్యచరణ రైతులకు వివరిం చాలన్నారు. వైద్యఆరోగ్య శాఖ సిబ్బంది వర్షాకాల వ్యాధులనివారణపై అవగాహన కల్పించాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు జిల్లాలోని చెరువుల కట్టల బలాన్ని పరిశీలించి, అవసరమైన ప్రాంతాల్లో వెంటనే పనులు చేపట్టాలని సూచించారు.
స్వచ్ఛగావ్ సురక్షిత జలవాయు
కార్యక్రమాలను నిర్వహించాలి..
పెద్దపల్లి : ప్రజాపాలన- ప్రగతిప్రణాళికలో భాగంగా గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్వచ్ఛగావ్, సురక్షిత జలవాయు కార్యక్రమాలను జిల్లాలో పకడ్బందీగా నిర్వ హించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛగావ్, సురక్షిత జలవాయు కార్యక్ర మంలో పాల్గొన్న కలెక్టర్ జూన్2వరకు నిర్వహించాల్సిన ప్రత్యేక ప్రచారకార్యక్రమాలను వివరించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛత, సుస్థిర జీవనశైలిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈకార్యక్ర మాల ప్రధానలక్ష్యమన్నారు. ప్రపంచపర్యావరణ దినోత్స వం సందర్భంగా ప్రత్యేకగ్రామసభ నిర్వహించడం, ఎస్‌డబ్ల్యూఎం నియమాలు, వ్యర్థాలనిర్వహణ, సాధించిన పురోగతిపై చర్చించి, వివరాలను ఎంవోపీఆర్ పోర్టల్‌లో నమోదు చేయడం, వ్యర్థాలతగ్గింపు, సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ నివారణ, నీటిసంరక్షణపై గ్రామాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో నరేందర్, డీఆర్డీవో కాళిందిని, బీసీ అభివృద్ధి అధి కారి రంగారెడ్డి, జిల్లా పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.