Peddapalli: కమిషనరేట్‌లో రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యం
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:35 PM
కోల్‌సిటీ, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): రామగుండం కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌లో రోడ్డు ప్రమా దాలు తగ్గించడమే లక్ష్యంగా కీలక చర్యలు తీసుకోను న్నట్టు రామగుండం సీపీ అంబర్‌కిశోర్ ఝా చెప్పారు.
అరైవ్,అలైవ్ పోస్టర్‌ను ఆవిష్కరించిన సీపీ అంబర్ కిశోర్ ఝా
కోల్‌సిటీ, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): రామగుండం కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌లో రోడ్డు ప్రమా దాలు తగ్గించడమే లక్ష్యంగా కీలక చర్యలు తీసుకోను న్నట్టు రామగుండం సీపీ అంబర్‌కిశోర్ ఝా చెప్పారు. గురువారం రామగుండంపోలీస్‌కమిషనరేట్‌లో జనవరి1 నుంచి 31వరకు నిర్వహించనున్న రోడ్డు భద్రత మాసో త్సవాల సందర్భంగా రోడ్డు భద్రతపై రూపొందించిన అరైవ్ అలైవ్ ట్రాఫిక్ అవగాహన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రతిఏటా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోందన్నారు. జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో రోడ్డుభద్రతపై అవగాహన పెరగాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపడం, రాంగ్ సైడ్ డ్రైవిం గ్, సిగ్నల్ జంపింగ్ వంటి నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిం చని వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. అరైవ్ అలైవ్ కార్యక్ర మంలో యువత, విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ అవ గాహన కల్పిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, రాత్రి సమయంలో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలుప కుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. చలికాలంలో ప్రమాదాల నివారణకు వాహనదారులు భీమ్ హెడ్ లైట్లను వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వర్‌రావు, పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ అనీల్ కుమార్ పాల్గొన్నారు.