Share News

Peddapalli: గ్రామంలో 150ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ నాటడమే లక్ష్యం

ABN , Publish Date - Apr 09 , 2026 | 12:28 AM

పాలకుర్తి, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఖరీఫ్‌ నాటికి గ్రామంలో అదనంగా 150ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ నాటడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష అన్నారు.

 Peddapalli:  గ్రామంలో 150ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ నాటడమే లక్ష్యం

- ఈసాలతక్కళ్లపల్లిలో ఆయిల్‌పామ్‌ సాగుపై సమీక్షలో కలెక్టర్‌

పాలకుర్తి, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఖరీఫ్‌ నాటికి గ్రామంలో అదనంగా 150ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ నాటడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష అన్నారు. బుధవారం మండలం పరిధి లోని ఈసాలతక్కళ్లపల్లి గ్రామంలో నిర్వహించిన ఆయిల్‌పామ్‌సాగుపై నిర్వహించిన సమీక్ష సమావే శంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వప్రోత్సహకాలను వినియోగిం చుకొని రైతులు ఆయిల్‌పామ్‌ సాగును విస్తరించా లని సూచించారు. గ్రామంలో సుమారు 150ఎక రాల్లో ఆయిల్‌పామ్‌ సాగుకు రైతులు సిద్ధంగా ఉన్న ప్పటికీ, రెండుసంవత్సరాలుగా వివిధ కార ణాల వల్ల నాటలేదని తెలిపారు. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లో ఈ 150 ఎకరాల్లో తప్పనిసరిగా కొత్తగాఆయిల్‌పామ్‌ నాటేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయిల్‌పామ్‌ పంటకు ఎకరాకు నాలుగు సంవత్సరాలపాటు సుమారు రూ.52 వేల విలువైన సబ్సిడీ ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయిల్‌పామ్‌ పంటకు మొదటి విడతగా లబ్ధిపొందిన రైతులు స్వప్న, చంద్రయ్యకు రూ.43వేల విలువైన చెక్కులను కలెక్టర్‌ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా హార్టికల్చర్‌ అధికారి జగన్మోహన్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడి శ్రావణ్‌కుమార్‌, జిల్లా భూగర్భ నీటిశాఖ అధికారి లావణ్య, తిరుమల ఆయిల్‌ పామ్‌ కంపెనీ సీఈవో కేషు కళ్యాణ్‌, అలా్ట్రటెక్‌ ప్లాంటేషన్‌ ఆఫీసర్‌ భరత్‌, రామగుండం ఉద్యానవనశాఖ అధికారి ఏ జ్యోతి, మండల వ్యవసాయ అధికారి బండి ప్రమోద్‌ కుమార్‌, వ్యవసాయవిస్తరణ అధికారి ఎం యోజన, బి రాము, టి ప్రశాంత్‌, రాజు, గ్రామ సర్పంచ్‌ బండి శ్రీనివాస్‌ గౌడ్‌, ఉప సర్పంచ్‌ ఓడ్నాల జ్యోతి, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2026 | 12:28 AM