Peddapalli: వైద్యసేవల్లో జిల్లాకు రాష్ట్రంలోనేఅగ్రస్థానం
ABN , Publish Date - Apr 09 , 2026 | 12:31 AM
పెద్దపల్లిటౌన్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లా ప్రధానాస్పత్రి వైద్యసేవల్లో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలి చిందని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు.
-ప్రభుత్వాస్పత్రికి అవార్డులు రావడంపై విప్ హర్షం
పెద్దపల్లిటౌన్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లా ప్రధానాస్పత్రి వైద్యసేవల్లో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలి చిందని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానికక్యాంపు కార్యాలయంలో బుధవారం విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. సూపరిం టెండెంట్ డాక్టర్ కొండా శ్రీధర్ కృషితో పాటు తన వంతు పూర్తి సహకారం అందించానన్నారు. మాటల మనిషి కాదని చేతల మనిషి అన్ని శ్రీధర్ నిరుపించకున్నాడన్నారు. ఒకేసారి వివిధ విభాగాల్లో నాలుగు అవార్డులు రావడం హర్షనీయమన్నారు.
రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆస్పతికి ఈ ఖ్యాతి రాలేదన్నారు. ఆసుపత్రికి వచ్చిన వివిధ రకాల రోగులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించడంతోనే జిల్లాతోపాటు పక్క జిల్లాల నుంచి ఇక్కడ వైద్యసేవలు తీసుకుంటున్నారని విప్ అన్నారు. రానున్న రోజుల్లో సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రిగా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. నూతన భవనం పూర్తి అయితే ఐసీయూ, ఎమ్మారై, తదితర ఆస్పత్రికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోనే జిల్లా ఆస్పత్రికి పేరు తీసుకువచ్చిన కొండా శ్రీధర్‌ను అభినందించి సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, గోపగాని సారయ్య గౌడ్, సయ్యద్ మస్రత్, గుజ్జుల కుమార్, తదితరులున్నారు.
డాక్టర్లను అభినందించిన కలెక్టర్..
పెద్దపల్లి : ప్రపంచ ఆరోగ్యదినోత్సవం సందర్భంగా రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన వైద్యవిధానపరిషత్ అవార్డుల్లో భాగంగా రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి నాలుగు అవార్డులు సాధించిన సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లా ఆసుపత్రి వైద్యబృందాన్ని బుధవారం ప్రత్యేకంగా అభినందించారు. అవార్డుల్లో భాగంగా సూపరింటెండెంట్, సివిల్‌సర్జన్(అనస్తీషియావిభాగం) డాక్టర్ కె శ్రీధర్ ప్రథమఅవార్డు అందుకున్నారు. అలాగే 3వేలకుపైగా ఆరో గ్యశ్రీ కేసులు నిర్వహించి రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచినందుకు రెండోఅవార్డు లభించింది. తెలంగాణ డయాగ్నస్టిక్ సేవల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానాన్ని సాధించినందుకు మూడోఅవార్డు అందుకోగా, రేడియాలజీ విభాగం తరపున డాక్టర్ సంధ్యారాణి నాలుగోఅవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా వైద్యబృందం తమకు లభించిన అవార్డులను జిల్లా కలెక్టర్ చూపించారు.