Peddapalli: సన్న బియ్యం పంపిణీ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే
ABN , Publish Date - Aug 10 , 2026 | 12:00 AM
పెద్దపల్లి టౌన్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెద్దపల్లి పట్టణంలోని శాంతినగర్‌లో నూతన రేషన్ షాపును స్థానిక నాయకులతో కలిసి
పెద్దపల్లి టౌన్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెద్దపల్లి పట్టణంలోని శాంతినగర్‌లో నూతన రేషన్ షాపును స్థానిక నాయకులతో కలిసి ప్రభుత్వవిప్, పెద్దపల్లి శాసనసభ్యుడు చింతకుంట విజయరమణారావు ప్రారంభించారు. అలాగే బోనాల పండుగ మహోత్సవం సందర్భంగా పట్టణంలోని జెండాచౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన బోనాల మహోత్సవంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ హయంలో పేదలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. అర్హులైన పేదలందరికీ నూతనంగా రేషన్‌కార్డులు మంజూరు చేసి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రాష్టానికే ప్రతీకగా నిలిచిన బోనాల పండు గను ప్రోత్సహిస్తూ రాష్ట ప్రభుత్వం ఆర్థిక సహకారాలు అందజేయ నున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, కౌన్సిలర్ మొలుగూరి కమల్, కాంగ్రెస్ నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.