Peddapalli: ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కేసీఆర్‌దే
ABN , Publish Date - Sep 17 , 2026 | 12:42 AM
పెద్దపల్లి రూరల్, సెప్టెం బరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని మాజీఎమ్మెల్యే దాసరి మనోహ ర్‌రెడ్డి అన్నారు.
- మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి
పెద్దపల్లి రూరల్, సెప్టెం బరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని మాజీఎమ్మెల్యే దాసరి మనోహ ర్‌రెడ్డి అన్నారు. బుధవారం పెద్దపల్లి మండలంలోని గోప య్యపల్లి గ్రామంలో లంబాడి తండలో గ్రామస్థులతో సమా వేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ గిరిజనుల విద్య,ఉద్యోగ అవకాశాలను పెంచాలనే లక్ష్యంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం 10శాతం రిజర్వేషన్ కల్పించిందని తెలిపారు. ఇలాకేసీఆర్ పదేళ్లపాలనలో గిరిజన తండాల అభివృద్ధికి ప్రత్యేకప్రాధాన్యత ఇచ్చామన్నారు. తండాలను గ్రామపంచాయతీ లుగా మార్చా మన్నారు. రోడ్లు, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు గురుకులాలు, వసతిగృహాల ద్వారా గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి, భోజన సదుపాయాలు అందించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా గిరిజనులకు ఇచ్చిన హామీలను కాలయాపన చేయకుండా అమలు చేయాలని డిమాండ్‌చేశారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్, పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్, మాజీసర్పంచ్ దాతు మంజుల- సదయ్య, మాజీమార్కెట్ కమిటీ చైర్మన్ శంకర్‌నాయక్, మాజీ వైస్‌ఎంపీపీ ముత్యాల రాజయ్య, బాపు, చంద్ర మొగిలి, వేల్పుల హరీష్, గున్నాల రాములు, అంబటి లక్ష్మీనారాయణ, రాకేష్, సంతోష్, బీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.