Share News

Peddapalli: ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదే

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:30 AM

పెద్దపల్లి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): పార్టీలకు అతీతంగా నియోజకవర్గానికి 3,500ఇళ్ల చొప్పున ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఘనత తమదేనని,

Peddapalli:  ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదే

- రాష్ట్ర వ్యాప్తంగా 4,50లక్షల ఇళ్ల నిర్మాణాలు

- నాడు డబుల్‌ బెడ్‌ రూములు ఇస్తామని మోసం

- కమీషన్లు, ఇసుక దోపిడీకి నాసిరకంగా చెక్‌ డ్యాములు నిర్మించారు.

- అసెంబ్లీలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు

పెద్దపల్లి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): పార్టీలకు అతీతంగా నియోజకవర్గానికి 3,500ఇళ్ల చొప్పున ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఘనత తమదేనని, ఈ పథకం ఆరు గ్యారంటీ పథకాల అమ లులో భాగమేనని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు చురకలు అంటించారు. గవర్నర్‌ ప్రసంగంపై ప్రతిపక్షాల విమర్శలకు సమాధానంగా బుఽధవారం విజయరమణారావు అసెంబ్లీ సమా వేశాల్లో ఘాటుగా స్పందించారు. గతప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూమ్‌లు అంటూ పెద్దపెద్ద మాటలు చెప్పి ఒక్కరికి ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హయాంలో ఒక్కో ఇంటి నిర్మాణానికి 5లక్షలు అందజేస్తున్నదన్నారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో 4లక్షల 50వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, వీటికోసం ప్రభుత్వం 22,500 కోట్లు వెచ్చిస్తున్నదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆరుగ్యారంటీ పథకాలపై సంతకం చేసిన ఫైల్‌ ఏమయ్యిందని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించడం కాదని, ఇందిరమ్మ ఇళ్లపథకం ఆరుగ్యారంటీ పథకాల్లో భాగమేనని తెలు సుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా 3,500ఇల్లు ఈదేశంలోనే ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్‌ప్రభుత్వం అని అన్నారు. ప్రతిరోజు బీఆర్‌ఎస్‌ నాయకులు అబద్దాలు చెబుతూ బతుకు తున్నారని, అందులో ఒకరినొకరు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు.

గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వంద, రెండు వందల రూపాయల బోనస్‌ ఇస్తామని ప్రజ లకు కలబొల్లి మాటలుచెప్పి అమలు చేయలేదన్నారు. ఒక్క పెద్దపల్లి నియోజకవర్గంలోనే 155కోట్ల బోనస్‌ రైతులకు ఇచ్చామన్నారు. మానేరు నదిలో ఉన్న ఇసుకను దోచుక పోవడానికి, కమీషన్ల కోసం కక్కుర్తిపడి నాసిరకంగా చెక్‌డ్యామ్‌లను నిర్మించారని విమర్శించారు.వాటిని ఎండా కాలంలో నిర్మాణం చేపడితే వర్షాకాలంలో కూలిపోయాయని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా నదులపై ఎక్కడ నిర్మాణం చేపట్టిన నాసిరకం పనులేనని పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయలను గత ప్రభుత్వం నీళ్ల పాలు చేసిందని విజయరమణారావు విమర్శించారు.

Updated Date - Mar 19 , 2026 | 12:30 AM