Share News

Peddapalli: లెక్క పక్కాగా చూపాల్సిందే..

ABN , Publish Date - Jan 19 , 2026 | 12:31 AM

పెద్దపల్లి రూరల్‌, జనవరి 18 (ఆంఽధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఖచ్చితంగా ఖర్చుల వివరాలు అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.

Peddapalli:  లెక్క పక్కాగా చూపాల్సిందే..

- జనవరి 31 లోగా ఖర్చుల వివరాలు సమర్పించాలి

- ఎన్నికల ఖర్చులు అభ్యర్థులు సమర్పించాల్సిందే..

- లేకుంటే భవిష్యత్‌లో పోటీకి అనర్హులయ్యే అవకాశం

- లెక్కకు మించితే వేటు తప్పదు

పెద్దపల్లి రూరల్‌, జనవరి 18 (ఆంఽధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఖచ్చితంగా ఖర్చుల వివరాలు అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో భవిష్యత్‌లో ఎన్నికల బరిలో నిలబడే అవకాశాలు కోల్పోవాల్సి వస్తుంది. లెక్కలు సమర్పించకుంటే ఏమ వుతుంది అని ఓడిపోయిన అభ్యర్థులు అనుకుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు పడా ల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన వారందరూ విఽధిగా లెక్కలు సమర్పించాలని లేనియెడల వేటుపడే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. నూతన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం 5వేల జనాభా దాటిన గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌ అభ్యర్థి రూ.2.50లక్షలు, వార్డు సభ్యులు రూ.50వేలు, 5వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్‌ అభ్యర్థి రూ.1.50లక్షలు, వార్డు సభ్యులు రూ.30వేలు వరకు ఖర్చు చేసుకోవచ్చు.

ఫ నిర్ణీత గడువులోగా లెక్కలు చూపించాలి..

పెద్దపల్లి మండలంలోని 30గ్రామపంచాయతీల్లో మూడోవిడత ఎన్నికలు డిసెంబరు 17న జరిగాయి. అయితే గెలుపొందిన అభ్యర్థులు, ఓడిపోయిన అభ్యర్థులు 45రోజుల్లోగా వ్యయఖర్చులు సమర్పించాల్సి ఉంది. జనవరి 31వ తేదీ లోపు సమ ర్పించాలని మండల అధికారులు, పంచాయతీ అధికారులు పలుమార్లు అభ్యర్థులకు సూచిస్తున్నారు. అభ్యర్థులు ఎన్నికల ఖర్చుకు సంబంధించి ప్రచారవ్యయ పుస్తకాలు, నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసినప్పటి నుంచి పోలింగ్‌ ముగిసే వరకు జరిగిన ఖర్చుల వివరాలు సమర్పించాలి. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పోటీలో నిలిచిన అభ్యర్థులు గెలిచినా, ఓడినా నిర్ణీత గడువులోగా లెక్కలు చూపాల్సి ఉంది. ఖర్చు చేసినా వాటికి తప్పనిసరిగా రశీదు బిల్లులు సమర్పించాలి.

ఫ తప్పనిసరిగా లెక్కలు సమర్పించాలి..

- కొప్పుల శ్రీనివాస్‌, ఎంపీడీవో, పెద్దపల్లి

గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఖర్చు వివరాలు సమర్పించాలి. ఎన్నికల సంఘం జనాభా ప్రాతిపదికన వ్యయపరిమితి విధించింది. దాని ప్రకారం ఖర్చుచేసిన ప్రతిపైసా లెక్క చూపాల్సిందే. లేకుంటే చర్యలు తప్పవు. పెద్దపల్లి మండలంలోని గ్రామపంచా యతీలో పోటీచేసిన అభ్యర్థులు జనవరి 31లోగా సమర్పించాలి. చూపని అభ్యర్థులు తదుపరి ఎన్నికల్లో పోటీచేయకుండా ఎన్నికల కమిషన్‌ నిషేధం విధించే అవకాశం ఉంది. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శుల ద్వారా అభ్యర్థులకు సమాచారం అందించాం.

Updated Date - Jan 19 , 2026 | 12:31 AM