Peddapalli: ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాలి
ABN , Publish Date - Aug 11 , 2026 | 12:22 AM
సుల్తానాబాద్/కాల్వశ్రీరాంపూర్/ఓదెల, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాలని సీపీఐ జిల్లాకార్యదర్శి తాండ్ర సదానందం పిలుపునిచ్చారు.
- సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు శంకర్
సుల్తానాబాద్/కాల్వశ్రీరాంపూర్/ఓదెల, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాలని సీపీఐ జిల్లాకార్యదర్శి తాండ్ర సదానందం పిలుపునిచ్చారు. కేంద్రప్రభుత్వం అనుసరి స్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సోమవారం సుల్తానాబాద్, కాల్వశ్రీరాంపూర్, ఓదెలలో సీపీఐ ప్రజాచైతన్యయాత్రను జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం.. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేని శంకర్ తోకలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తాండ్ర సదానందం మాట్లాడుతూ బీజేపీ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతు న్నదని, మతతత్వాన్ని పోషిస్తూ కులమతాల మధ్య చిచ్చుపెడుతోందన్నారు. సీపీఐ ఆధ్వ ర్యంలో బీజేపీ హటావో దేశ్‌కో బచావో అనే నినాదంతో సెప్టెంబర్1న ఢిల్లీ రాజధానిగా రామ్‌లీలా మైదాన్‌లో భారీ బహిరంగసభ జరగబోతుందన్నారు. దీని జయప్రదం కోసం దేశవ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్ర కొన సాగిస్తున్నామని తెలి పారు. ఓదెలలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు శంకర్ మాట్లా డుతూ కేంద్రంలో ఉన్న బీజేపీతోనే దేశవ్యాప్తం గా రాజ్యాంగ విలువలు ఖూనీ అయ్యాయని అన్నారు. సోమవారం పొత్కపల్లి, కనగర్తి, ఓదెల గ్రామాల్లో సీపీఐ ప్రజాచైతన్య యాత్ర నిర్వహించి, కేంద్రంలో బిజేపి పాలన తీరును ఎండగట్టారు. పొత్కపల్లిలో ఆయన మాట్లా డుతూ.. మాశక్తి మేరకు చీలిన అన్ని కమ్యూ నిస్టు పార్టీలను ఐక్యంచేసి మతోన్మాద పాల నను గద్దె దింపాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. కార్యక్రమం లో జిల్లా, రాష్ట్రనాయకులు గౌతమ్‌గోవర్ధన్, గోశిక మోహన్, కే కనకరాజు, రామగుండం నగర సీపీఐ కార్పొరేటర్ మార్కాపూరీ సూర్య, కోడంస్వామి, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్య దర్శి లక్ష్మీనారాయణ, తాళ్లపల్లి మల్లయ్య, ఎం ఎల్లయ్య, ఎజ్జ రాజయ్య, ఓదమ్మ ,పూసల రమేష్, ప్రీతం ,శనిగరపు చంద్రశేఖర్, తోడేటి లావణ్య, రచన, ఏం తిరుపతి, శ్రీనివాస్ రెడ్డి, గట్టయ్య, పోచమ్మ, రమాదేవి, ప్రీతం, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఎజ్జ రాజయ్య, సమ్మెట నాగేందర్, పల్లె గట్టయ్య, ఆళ్ల చిన్న శ్రీనివాసరెడ్డి, సూత్రాల స్వామి,రంగు శంకర్, సీపీఐ కార్యకర్తలు పాల్గొన్నారు.