Share News

Peddapalli: బాలల రక్షణలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

ABN , Publish Date - Sep 20 , 2026 | 12:36 AM

పెద్దపల్లి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, రక్షణతో పాటు వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌అండ్‌సెషన్స జడ్జి సునీత కుంచాల అన్నారు.

 Peddapalli:  బాలల రక్షణలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

- ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి సునీత కుంచాల

పెద్దపల్లి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, రక్షణతో పాటు వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌అండ్‌సెషన్స జడ్జి సునీత కుంచాల అన్నారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో మిషన్‌ బాలసురక్షశిక్షా, న్యాయ 2026లో భాగంగా చైల్డ్‌ప్రొటెక్షన్‌ ఆఫీసర్లుగా నామి నేట్‌ చేసిన ఉపాధ్యాయులకు పిల్లల హక్కులపై వన్‌డే సెన్సిటైజేషన్‌ కార్య క్రమాన్ని ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి సునీత కుంచాల, అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి (పోక్సో) కె స్వప్నరాణి, డీసీపీ రాంరెడ్డి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి సునీత కుంచాల మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, రక్షణతోపాటు వారి భవిష్య త్తును తీర్చిదిద్దేందుకు రాష్ట్ర న్యాయసేవా అధికారసంస్థ, విద్యాశాఖ సంయు క్తంగా అవగాహనఒప్పందం కుదుర్చుకున్నాయని తెలిపారు. పిల్లలకు చదువుతోపాటు మంచి నడవడిక, రక్షణ, భద్రతాప్రమాణాలపై అవగాహన కల్పించడం ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ముఖ్య బాధ్యత అని జడ్జి అన్నా రు. పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి ఎంతో కీలకమని అన్నారు. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రస్తుతకాలంలో 6,7,8వ తరగతుల విద్యార్థుల్లో కూడా కొన్నిరకాల వ్యసనాల ప్రభావం కనిపిస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం సాధన సొసైటీ ఆధ్వర్యంలో రూపొందించిన జస్ట్‌రైట్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ పోస్టర్‌ను ప్రిన్సిప ల్‌ డిస్ట్రిక్ట్‌అండ్‌సెషన్స్‌ జడ్జి సునీత కుంచాల ఆవిష్కరించారు. బాలల హక్కు లు, వారిరక్షణకు సంబంధించిన అంశాలపై అవగాహన పెంపొందించేం దుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. కార్యక్ర మంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లేశం, జిల్లా విద్యాశాఖ అధికారి (ఇన్‌చార్జి) వి హన్మంతు, గర్ల్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ కవిత, డిస్టిక్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ జితేందర్‌, లీగల్‌కంప్రొవిషన్‌ ఆఫీసర్‌ రజిత, న్యాయ, పోలీస్‌,విద్యాశాఖ అధికారులు, చైల్డ్‌ప్రొటెక్షన్‌ ఆఫీసర్లుగా నామినేట్‌ చేసిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2026 | 12:36 AM