Share News

Peddapalli: ఎల్‌నినోతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ABN , Publish Date - Nov 27 , 2026 | 12:23 AM

పెద్దపల్లి టౌన్‌, నవంబరు 26 (ఆంధ్ర జ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకో వాలని, తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించి నష్టపరిహారం చెల్లించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకులు డిమాండ్‌ చేశారు.

Peddapalli:  ఎల్‌నినోతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
ధర్నా చేస్తున్న నాయకులు

అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత

పెద్దపల్లి టౌన్‌, నవంబరు 26 (ఆంధ్ర జ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకో వాలని, తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించి నష్టపరిహారం చెల్లించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం రైతు కూలీ సంఘం (ఆర్‌సీఎస్‌), తెలంగాణ ప్రజాఫ్రంట్‌, భారతకమ్యూనిస్టు పార్టీ, అఖిల భారత రైతుకూలీ సంఘం, రైతు కార్మికసంఘాల ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టరేట్‌ ఎదుట నిరసనచేపట్టి అదనపుకలెక్టర్‌ శ్రీరాము లుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్‌సీఎస్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి వెల్తురు సదా నందం మాట్లాడుతూ రైతు వ్యతిరేక నల్ల చట్టా లను రద్దుచేసే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని తదితర డిమాండ్లుచేశారు. అఖిలభారతరైతు కూలీ సంఘం జిల్లానాయకుడు మెరుగు చంద్రగౌడ్‌ భారతకమ్యూనిస్టుపార్టీ జిల్లాకార్యదర్శి తాండ్ర సదానందం తెలంగాణప్రజాఫ్రంట్‌ జిల్లా అధ్య క్షుడు గుమ్మడి కొమురయ్య మాట్లాడుతూ రైతాం గ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు గుండేటి మల్లేశం, తుళ్లగట్టయ్య, ఎస్‌ రాజేశ్వర రావు, బాబు, గుండురాజయ్య, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి రేణిగుంట్లప్రీతం పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2026 | 12:23 AM