Peddapalli: విజయవంతమైన బడిబాట కార్యక్రమం
ABN , Publish Date - May 14 , 2026 | 11:44 PM
పెద్దపల్లి కల్చరల్, మే 14 (ఆంధ్రజ్యోతి): విద్యావారోత్సవాల్లో భాగంగా జిల్లాలో నిర్వహించిన నాలుగవరోజు బడిబాట కార్యక్ర మాలు
- జిల్లా విద్యాధికారి శారద
పెద్దపల్లి కల్చరల్, మే 14 (ఆంధ్రజ్యోతి): విద్యావారోత్సవాల్లో భాగంగా జిల్లాలో నిర్వహించిన నాలుగవరోజు బడిబాట కార్యక్ర మాలు విజయవంతంగా జరుగు తున్నాయని జిల్లావిద్యాధికారి శారద తెలిపారు. గురువారం జిల్లా లోని పలు మండలాల్లో మొత్తం 510పాఠశాలలు, కళాశాలల్లో మెగా పీటీఎంలు నిర్వహించగా, వీటిలో 4395మంది తల్లిదండ్రులు, 534మంది పూర్వవిద్యార్థులు, 771మంది ప్రజాప్రతి నిధులు పాల్గొనట్లు వివరించారు. విద్యా ర్థుల భవిష్యత్ దృష్ట్యా జిల్లాలో 128కేరీర్ గైడెన్స్, ఉన్నతవిద్యా అవగాహన కార్యక్ర మాలు నిర్వహించారని అన్నారు. ఇందులో 2122మంది విద్యార్థులు పాల్గొని ఉన్నత విద్య, ఉద్యోగఅవకాశాలపై అవగాహన కల్పించారన్నారు. అలాగే విద్యా ర్థుల్లో సృజ నాత్మకత, ఆరోగ్యకర జీవనశైలిపై అవ గాహన కల్పించేందుకు జిల్లాలో 68వంటల పోటీలు నిర్వహించారని, వైద్యశిబిరాలు కూడా నిర్వహించినట్లు తెలిపారు. పాఠశా లల అభివృద్ధిలో తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, పూర్వవిద్యార్థులు భాగ స్వామ్యం కావడం అభినందనీయ మన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉపాధ్యాయులు, విద్యాశాఖసిబ్బంది, ప్రజా ప్రతినిధులకు తల్లిదండ్రులకు డీఈవో కృత జ్ఞతలు తెలిపారు.