Share News

Peddapalli: సమ్మె సమయంలో హింసకు పాల్పడితే కఠిన చర్యలు

ABN , Publish Date - Apr 23 , 2026 | 12:33 AM

కోల్‌సిటీ, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్‌టీసీ సమ్మె నేపథ్యంలో రామ గుండం పోలీస్‌ కమిషన రేట్‌ పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌లో శాంతిభధ్రతలకు భంగం కలిగించే విధంగా దాడులు, బెదిరింపు లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ఝా హెచ్చరించారు.

 Peddapalli: సమ్మె సమయంలో హింసకు పాల్పడితే కఠిన చర్యలు

కోల్‌సిటీ, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్‌టీసీ సమ్మె నేపథ్యంలో రామ గుండం పోలీస్‌ కమిషన రేట్‌ పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌లో శాంతిభధ్రతలకు భంగం కలిగించే విధంగా దాడులు, బెదిరింపు లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ఝా హెచ్చరించారు. సమ్మెసమయంలో విధుల్లో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న తాత్కా లిక డ్రైవర్లు, కండక్టర్లు, అలాగే అద్దె బస్సుల యజ మానులను లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యక్తులు దాడులు చేయడం, బెదిరింపులకు పాల్పడడం, ఇండ్లపై దౌర్జన్యాలకు దిగడం వంటి ఘటనలు పోలీస్‌శాఖ తీవ్రంగా పరిగణిస్తుందని అన్నారు. ఎవరైనా చట్ట విరు ద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉద్యోగం కోసం వచ్చే వారికి పూర్తిరక్షణ కల్పిస్తామని, ఎవరైనా బెదిరింపులు, దాడులు చేస్తే వెంటనే పోలీసు లకు సమాచారం ఇవ్వాలని, అత్యవసర సహాయం కోసం రామగుండం పోలీస్‌ కమిషరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌నెం. 8712656597, డయల్‌ 100కు కాల్‌ చేయాలని సూచించారు.

Updated Date - Apr 23 , 2026 | 12:33 AM