Peddapalli:ఇటుక బట్టీల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు
ABN , Publish Date - Nov 27 , 2026 | 12:28 AM
పెద్దపల్లి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఇటుక బట్టీల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్ కోయశ్రీహర్ష స్పష్టం చేశారు.
- కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఇటుక బట్టీల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్ కోయశ్రీహర్ష స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్‌లో ఇటుక బట్టీల యజమానులు, వివిధశాఖల అధికారు లతో కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ బి శ్రీరాములుతో కలిసి అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ, ఇటుకబట్టీల నిర్వహణకు కార్మికచ ట్టాలు, ఆక్యుపేషనల్ సేఫ్టీ, సోషల్‌సెక్యూరిటీ, బాండెడ్ లేబర్‌యాక్ట్, పోక్సో, జువెనైల్ జస్టిస్, పాష్‌యాక్ట్, ఎయిర్ అండ్ వాటర్‌యాక్ట్ వంటి దాదాపు 13నుంచి 19రకాలచట్టాలు, నిబంధ నలు వర్తిస్తాయని తెలిపారు. కార్మికుల ఆధార్ కార్డులు, రేషన్‌కార్డులు, మొబైల్‌ఫోన్లను బలవం తంగా లాక్కోవడం, వారి కదలికలను కట్టడి చేయడంవంటి చర్యలకు పాల్పడవద్దని తెలి పారు. అడ్వాన్స్ ఇచ్చామనే కారణంతో కార్మికు లను బలవంతంగా పని చేయించకూడదని, వారికి ఇష్టం లేకపోతే వెళ్లిపోయే పూర్తి స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేశారు. పనిచేయలేదని కార్మికులపై చేయి చేసుకోవడం, కొట్టడం లేదా వేధించడం వంటివి చేస్తే ఎంతటి రాజకీయ ఒత్తిడి తెచ్చినా ఉపేక్షించబోమని, కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితు ల్లోనూ పిల్లలు పనుల్లో ఉండకూడదన్నారు. పిల్లలు క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లేలా యజమానులు బాధ్యత తీసుకోవాలని సూచిం చారు. వచ్చేవారంనుంచి 10రోజుల్లోగా పంచా యతీ కార్యదర్శులు ప్రతిఇటుకబట్టీని సందర్శించి వివరాలు సేకరిస్తారని, యజమానులు తమవద్ద పనిచేస్తున్న కార్మికుల సంఖ్య, వారి వయస్సు, చిరునామా, సొంత రాష్ట్రం, జిల్లా, వారు పనిలోకి వచ్చిన తేదీ, తిరిగి వెళ్లే సమయం, మొబైల్ నంబర్లు, కుటుంబసభ్యుల వివరా లను పంచాయతీ కార్యదర్శులకు తప్పనిస రిగా అందించాలని ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, కార్మిక శాఖల అధికారులతో కూడిన సంయుక్త బృందాలు ప్రతినెలా 5నుంచి 10ఇటుకబట్టీలను ఆకస్మికంగా తనిఖీచేస్తాయని, తనిఖీల సమయంలో కార్మికులకు కల్పిస్తున్న కనీససౌకర్యాలు, వారి పట్ల వ్యవహరిస్తున్న తీరును పరిశీలిస్తారని చెప్పారు. కార్మికుల వివరాలు ఇవ్వకపోయినా, నిబంధనలు ఉల్లంఘించినా తక్షణమే బట్టీని సీజ్‌చేసి, అన్నిరకాల వ్యాపార కార్యకలాపాలను నిలిపివేస్తామని స్పష్టంచేశారు. సమావేశంలో పెద్దపల్లి ఆర్డీవోగంగయ్య, జిల్లాపంచాయతీ అధి కారి శ్రీమాల, అసిస్టెంట్ లేబర్‌ఆఫీసర్లు అనిల్ కదం,శ్రీకాంత్,రవీందర్,ఇటుకబట్టీల యజమా నులు, అధికారులు పాల్గొన్నారు.