Peddapalli: మద్యం తాగి వాహనం నడిపితే కఠినచర్యలు
ABN , Publish Date - Jun 11 , 2026 | 12:36 AM
పెద్దపల్లి రూరల్, జూన్ 10 (ఆంధ్ర జ్యోతి): మద్యం సేవించి వాహనం నడిపితే కఠినచర్యలు తప్పవని పెద్దపల్లి డీసీపీ భూక్యారామ్‌రెడ్డి అన్నారు.
- పెద్దపల్లి డీసీపీ భూక్యా రామ్‌రెడ్డి
పెద్దపల్లి రూరల్, జూన్ 10 (ఆంధ్ర జ్యోతి): మద్యం సేవించి వాహనం నడిపితే కఠినచర్యలు తప్పవని పెద్దపల్లి డీసీపీ భూక్యారామ్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని హన్మంతునిపేట గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో పెద్దపల్లిరూరల్ పోలీస్ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెద్దపల్లి డీసీపీ రామ్‌రెడ్డి, ఏసీపీ గజ్జికృష్ణ హాజరయ్యారు. డీసీపీ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కలిగి ఉండాలన్నారు. వాహనా లకు ధ్రువపత్రాలు కలిగి ఉండాలని, 18ఏళ్లు పైబడిన వారు, డ్రైవింగ్‌లైసెన్స్ కలిగి ఉంటేనే వాహనాలు నడపాలన్నారు. సైబర్‌నేరాలు పెరిగిపోతున్నాయని, వాటిపట్ల అప్రమ త్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మ్యాడగోని శ్రీనివాస్‌గౌడ్, ఉప సర్పంచ్ మేకల కుమార్‌యాదవ్, రూరల్ ఎస్‌ఐ2శ్వేత, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
మత్తు రహిత సమాజ
నిర్మాణానికి ముందడుగు వేయాలి
పెద్దపల్లి టౌన్ : మత్తురహిత సమాజ నిర్మాణం కోసం అందరూ కలిసి ముందడుగు వేయాలని డీసీపీ రాంరెడ్డి సూచించారు. పట్టణంలోని చందపల్లి దర్గా ప్రాంగణంలో ఈగల్ ఫోర్స్, అటవీ శాఖ, పోలీసు శాఖలు సంయుక్తంగా మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన, మొక్కల నాటే కార్యక్రమం నిర్వ హించారు. ఈ సంద ర్భంగా డీసీపీ మాట్లా డుతూ మత్తు పదా ర్థాల వినియోగం వల్ల వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబవ్యవస్థ, సమాజం పై తీవ్రప్రతికూల ప్రభావాలు ఏర్పడ తాయన్నారు. కార్యక్రమంలో భాగంగా చంద పల్లి దర్గా ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో ఏసీపీ గజ్జి కృష్ణ, ఎస్‌ఐ నరేష్, ఈగల్ ఫోర్స్ సిబ్బంది, అటవీ అధికారులు, స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు, గంజాయి వినియోగదారులు పాల్గొన్నారు.
గంజాయి నిర్మూలనకు సహకరించాలి
కళ్యాణ్‌నగర్ : గంజాయి నిర్మూలనలో ప్రజల సహకారం ఎంతో అవసరమని డీసీపీ రాంరెడ్డినాయక్ అన్నారు. బుధవారం గోదా వరిఖని ప్రభుత్వ జనరల్‌ఆసుపత్రిలో ఏర్పా టుచేసిన డీఅడిక్షన్‌సెంటర్‌ను సందర్శించారు. చికిత్స పొందుతున్న యువకులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, చికిత్స విధానం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మత్తు పదా ర్థాలకు బానిసలైన వారిని గుర్తించి నార్కోటిక్ పరీక్షల నిర్వహిస్తున్నామని, పరీక్షల్లో పాజి టివ్ వచ్చిన వారిని డీఅడిక్షన్ సెంటర్‌కు పంపిస్తున్నట్టు చెప్పారు. గంజాయి సరఫరా చేసే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతుం దని తెలిపారు. నిపుణులైన వైద్యులతో మత్తు పదార్థాలకు బానిసైనవ్యక్తులు తిరిగి సాధా రణ జీవనానికి వచ్చేవిధంగా కృషి చేస్తు న్నట్టు చెప్పారు. అనంతరం గంజాయికి బాని సై డీఅడిక్షన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న వారితో మొక్కలను నాటించారు.డీసీపీ వెంట వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్‌ఇంద్రసేనారెడ్డి, నార్కోటిక్ పెద్దపల్లి ఇన్‌స్పెక్టర్ రాజ్‌కుమార్, రామ గుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వర్‌రావు, ఆర్‌ఎంవో కృపాభాయి ఉన్నారు.